
ప్రధాని నరేంద్రమోడీ కేబినెట్ విస్తరణ పూర్తయింది. ఇక ఏపీలో మంత్రివర్గ కూర్పుపై చంద్రబాబు దృష్టి పెట్టనున్నారు. భారీ మెజారిటీని సొంతం చేసుకున్న కూటమి సభ్యులతో కలిసి.. పూర్తిస్థాయిలో తమ మంత్రివర్గం ఉండేలా చంద్రబాబు కసరత్తు చేయడానికి రెడీ అవుతున్నారు.తాజా ఎన్నికలలో టీడీపీ,బీజేపీ,జనసేన కూటమి మొత్తం 175 అసెంబ్లీ స్థానాలలో.. ఏకంగా 164 సీట్లను కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు త్వరత్వరగా రెడీ అవుతున్నారు.
జూన్ నెల 12న ఉదయం 11.27 గంటలకు చంద్రబాబు ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనుండగా.. చంద్రబాబుతో పాటు కొంతమంది మంత్రులు కూడా అదే రోజు ప్రమాణస్వీకారం చేయనున్నారు. జూన్ 11న టీడీపీ శాసనసభాపక్ష సమావేశం జరబోతోంది. టీడీఎల్పీ భేటీ తర్వాత టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎమ్మెల్యేలు సమావేశం అయి.. ఎమ్మెల్యేలంతా చంద్రబాబును తమ నాయకుడిగా ఎన్నుకుంటారు.
జనసేనకు 21, బీజేపీకి 8 మంది ఎమ్మెల్యేలు ఉండటంతో.. వీరిలో ఏ పార్టీకి చెందిన వారికి ఎన్ని మంత్రి పదవులు దక్కుతాయన్నది ఆసక్తికరంగా మారింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంత్రి పదవిని తీసుకుంటారా? లేదా? ఒకవేళ తీసుకుంటే ఏ శాఖను ఎంచుకుంటారనేది దేశ వ్యాప్తంగా మరోసారి చర్చనీయాంశంగా మారింది. మరోవైపు, పూర్తి స్థాయి కేబినెట్‌తో పరిపాలన ప్రారంభించడానికి చంద్రబాబు కసరత్తులు చేస్తున్నారు. ముఖ్యమంత్రితో కలిపి 26 మందితో తమ కేబినెట్ ప్రకటించే అవకాశాలున్నాయి. ఏపీ కేబినెట్ కూర్పుపై ఎన్డీయే పెద్దలు ఇప్పటికే చంద్రబాబుకు పూర్తి స్థాయిలో స్వేచ్ఛ ఇచ్చినట్టు తెలుస్తోంది.దీంతో ఇప్పటికే జనసేన అధినేత, పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్‌తో పాటు బీజేపీ నేతలతోనూ టీడీపీ అధినేత చంద్రబాబు తమ మంత్రివర్గ అంశంపై చర్చించినట్లు తెలుస్తోంది.
అయితే పవన్‌కళ్యాణ్‌కు డిప్యూటీ సీఎం పదవితో పాటు మరో కీలక మంత్రి పదవిని చంద్రబాబు అప్పజెప్పే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయని పార్టీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. పవన్ సినిమా పరిశ్రమకు చెందిన వ్యక్తి కావడంతో.. ఏపీలో చలనచిత్ర పరిశ్రమ అభివృద్దికి కృషిచేయడానికి సినిమాటోగ్రఫీ శాఖను కేటాయించనున్నట్లు కూడా జోరుగా చర్చ నడుస్తోంది.
జనసేన అధినేత ఆదివారం జరిగిన ప్రధానమంత్రి ప్రమాణ స్వీకారోత్సవానికి సతీసమేతంగా హాజరవగా.. ఆ కార్యక్రమంలో నేషనల్ మీడియా ప్రతినిధులు పవన్‌తో మాట్లాడటానికి పోటీపడటం అందరి దృష్టిని ఆకట్టుకుంది. జాతీయ మీడియా పవన్‌ను పదవులపై ప్రశ్నించగా..పవన్ చెప్పిన సమాధానం స్పష్టంగా వినిపించలేదు. కానీ పవన్ డిప్యూటీ సీఎం పదవిని ఆశిస్తున్నట్లు జాతీయ మీడియా వార్తలను ప్రసారం చేసింది. అయితే నిజంగా పవన్ కు ఏ పదవిని ఇస్తారనేది మాత్రం తెలియాలంటే మరికొద్ది గంటలు వేచి చూడాల్సిందే.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY