రమ్య కుటుంబసభ్యులను పరామర్శించిన హోంమంత్రి సుచరిత, ఇంటి స్థలం పట్టా అందజేత

AP Home Minister, AP Home Minister Sucharitha, AP Home Minister Sucharitha Hands Over House Plot Document to Family of Btech Student Ramya, Btech Student Ramya, Btech Student Ramya Case, Btech Student Ramya Incident, Family of Btech Student Ramya, House Plot Document to Family of Btech Student Ramya, Mango News, Ramya Murder, Ramya Murder Case, Sucharitha Hands Over House Plot Document to Family of Btech Student Ramya

బీటెక్ విద్యార్థిని రమ్య కుటుంబ సభ్యులకు గురువారం ఏపీ హోంమంత్రి మేకతోటి సుచరిత ఇంటి పట్టాను అందించారు. గుంటూరు పరమాయకుంటలోని రమ్య ఇంటికి స్వయంగా వెళ్లి, ప్రభుత్వం తరపున ప్రకటించిన ఇంటి స్థలానికి సంబంధించిన పట్టా ఇవ్వడంతో పాటు, కుటుంబసభ్యులను పరామర్శించారు. రమ్య కుటుంబ సభ్యులను పరామర్శించిన వారిలో హోంమంత్రితో పాటుగా ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్యేలు మేరుగు నాగార్జున, ముస్తఫా, మద్దాలి గిరి, కలెక్టర్ వివేక్ యాదవ్, జిడిసీసీ ఛైర్మన్ లాల్ పురంరాము, ఇతర అధికారులు, నాయకులు ఉన్నారు. ఈ సందర్భంగా రమ్య కుటుంబసభ్యులకు హోంమంత్రి సుచరిత ప్రగాఢ సానుభూతిని తెలిపారు. భవిష్యత్తు లో రమ్య కుటుంబసభ్యులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. నిందితుడికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

అనంతరం హోంమంత్రి సుచరిత మీడియాతో మాట్లాడుతూ, ఆకతాయిలు నుండి వేధింపులు ఉంటే తల్లిదండ్రులకు, లేదంటే పోలీసులకు చెప్పాలని విద్యార్థినులకు సూచించారు. సోషల్ మీడియా ద్వారా పరిచయం చేసుకునే అపరిచితుల పట్ల అమ్మాయిలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రేమిస్తున్నానని వెంటపడి వేధిస్తున్న వారిపై దిశ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వాలని సూచించారు. పోలీస్ స్టేషన్ కు వెళ్లాల్సిన అవసరం లేకుండా దిశ ఎస్ఓఎస్ యాప్ ద్వారా నేరుగా మొబైల్ నుండే కంప్లైంట్ ఇవ్వొచ్చని అన్నారు. ఇప్పటికే దాదాపు 40 లక్షలకు పైగా దిశ యాప్ ను డౌన్ లోడ్ చేసుకున్నారని, 3 లక్షలకు పైగా కాల్స్ చేసారని హోంమంత్రి తెలిపారు. మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడిన ప్రతి ఒక్కరికీ శిక్ష విధించడం జరిగిందన్నారు. మహిళల భద్రతపై సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చిత్తశుద్ధితో ఉన్నారని హోంమంత్రి తెలిపారు. రాష్ట్రంలో ఏక్కడ మహిళలపై అఘాయిత్యం జరిగినా సీఎం స్వయంగా స్పందిస్తున్నారని పేర్కొన్నారు. అంతేకాదు బాధిత కుటుంబాలకు సీఎం మానవతా దృక్పథంతో సత్వర ఆర్థిక సహాయం చేస్తున్నారన్నారు. సోషల్ మీడియా వేదికగా అమ్మాయిలను ట్రాప్ చేస్తున్న వారి పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎన్ని రకాలుగా మోసాలు చేస్తారు అనే అంశంపై విద్యార్థినులకు అవగాహన కల్పించాలని హోంమంత్రి సుచరిత సూచించారు. మరోవైపు హోం మంత్రి సుచరిత ముందుగా గత సోమవారం రమ్య కుటుంబ సభ్యులను పరామర్శించి, సీఎం వైఎస్ జగన్ ప్రకటించిన విధంగా రూ.10 లక్షల చెక్ ను కూడా అందజేసిన విషయం తెలిసిందే.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

11 − 8 =