ఏపీలో రాజకీయాలు రోజురోజుకు రసవత్తరంగా మారుతున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. మొన్నటి వరకు ప్రభుత్వ అండ చూసుకొని రెచ్చిపోయిన వైసీపీ నేతలు.. ఇప్పుడు అధికారం కోల్పోవడంతో చల్లబడిపోయారు. అంతేకాకుండా కూటమి ప్రభుత్వం నుంచి ఒత్తిళ్లను ఎలా ఎదుర్కోవాలనే దానిపై తర్జన భర్జన పడుతున్నారు. మరోవైపు ఇప్పటికే కొందరు వైసీపీ నేతలకు బ్యాండ్ మోగిపోతున్నట్లు తెలుస్తోంది. కొందరు ఒత్తిళ్లను ఎదుర్కోలేక అధికార పక్షంలోకి జంప్ అయ్యేందుకు దారులను వెతుకుతున్న సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఇదే సమయంలో వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి ఎమ్మెల్యే పదవికే ఎసరు వచ్చింది. ఆయనపై ఎమ్మెల్యేగా అనర్హత వేటు వేసినా వేయొచ్చని తెలుస్తోంది.
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పుంగనూరు నుంచి వైసీపీ తరుపున పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి బరిలోకి దిగారు. టీడీపీ కూటమి అభ్యర్థిపై కేవలం 6 వేల ఓట్ల తేడాతో గెలుపొందారు. అయితే ఎన్నికల వేళ తన ఆస్తులకు సంబంధించి ఎన్నికల సంఘానికి పెద్దిరెడ్డి తప్పుడు అఫిడవిట్‌ను సమర్పించారని ఆరోపణలు ఉన్నాయి. ఎన్నికల అఫిడవిట్‌లో పెద్దిరెడ్డి తన భార్య పేరుపై ఉన్న పలు ఆస్తులను పొందుపరచలేదని టీడీపీ తరుపున బరిలోకి దిగిన చల్లా రామచంద్రా రెడ్డి ఆరోపించారు. ఎన్నికలప్పుడే ఈ విషయంపై గవర్నర్, ఎన్నికల సంఘం అధికారులకు ఫిర్యాదు చేశారు. కానీ అప్పట్లో అధికారుల ఎటువంటి చర్యలు తీసుకోలేదు. దీంతో ఇప్పుడు చల్లా రామచంద్రా రెడ్డి ఇదే విషయంపై మరోసారి హైకోర్టుకు వెళ్లారు.
ఇటీవల చల్లా రామచంద్రారెడ్డి హైకోర్టులో పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డిపై పిటిషన్ దాఖలు చేశారు. ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్‌లో పెద్దిరెడ్డి ఆస్తులకు సంబంధించి తప్పుడు వివరాలు పొందు పరిచారని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఆ పిటిషన్‌ని ఏపీ హైకోర్టు విచారణకు స్వీకరించింది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసిన ప్రభుత్వం.. పెద్దిరెడ్డి ఆస్తుల వివరాలను కోరింది. అలాగే చల్లా రామచంద్రారెడ్డిని కూడా కౌంటర్ దాఖలు చేయాలని కోరింది. ఈరోజే ఆ పిటిషన్‌పై కోర్టు విచారణ చేపట్టనుంది. ఎన్నికల అఫిడవిట్‌లో తప్పుడు వివరాలు ఇస్తే ఆ ఎమ్మెల్యేపై అనర్హత వేటు పడుతుంది. మరి చూడాలి హైకోర్టు ఏ విధంగా తీర్పు ఇస్తుందనేది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE