ఆగస్టు 15 నుంచి ఏపీలో గ్రామ వాలంటీర్ల వ్యవస్థ

Ap Political News, AP Political Updates 2019, Village Volunteers, Village Volunteers System, Village Volunteers System In AP, Village Volunteers System In AP From August 15, Village Volunteers System Set To Be Begin In AP, Village Volunteers System Set To Be Begin In AP From August 15, Village Volunteers System To Be Begin In AP, YCP Government

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆగస్టు 13, మంగళవారం నాడు అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. గ్రామ వాలంటీర్ల బాధ్యతలు, గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగాల నియామకాలకు సంబంధించి వారితో చర్చించి సూచనలు చేసారు. త్వరలో ఏర్పడే గ్రామ సచివాలయాలకు, ప్రజలకు మధ్య వారధిగా గ్రామ వాలంటీర్లు ఉండాలని చెప్పారు. ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం నాటి నుంచే గ్రామ వాలంటీర్లు విధులకు హాజరు కావాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. వారికీ ప్రత్యేక షెడ్యూల్ సైతం ప్రకటించారు. వీరికి వివిధ అంశాలపై శిక్షణ, అవగాహనా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ ఆగస్టు 15న విజయవాడలో అధికారికంగా గ్రామ వాలంటీర్ల వ్యవస్థను ప్రారంభించనున్నారు.

కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ లో ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మాట్లాడుతూ, కేవలం 40 రోజుల్లోనే రికార్డు స్థాయిలో 2.5 లక్షల మందిని గ్రామ వాలంటీర్లుగా నియమించామని చెప్పారు. గ్రామ సచివాలయాలకు సంబంధించిన 1.34 లక్షల ఉద్యోగాలకు సుమారు 22 లక్షలమంది దరఖాస్తులు చేసుకున్నారని, ఈ నియామకాలు సైతం పారదర్శకంగా, త్వరితగతిన నిర్వహిస్తున్నట్టు చెప్పారు. త్వరలో జరగబోయే గ్రామ సచివాలయాల పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేయాలనీ, ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2 నుంచి గ్రామ సచివాలయాలు అందుబాటులోకి వస్తాయని, వారికీ అక్టోబర్ 3 నుంచి 30 వరకు శిక్షణా కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పారు.

 

[subscribe]
[youtube_video videoid=t0FsQLvKFbs]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × three =