ఏపీ ఎన్నికలవేళ హాట్ టాపిక్‌గా మారారు మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి. పోలింగ్ బూత్‌లోకి వెళ్లి ఈవీఎం మిషన్‌నే ఆయన ధ్వంసం చేశారు. అందుకు సంబంధించిన వీడియో బయటకు రావడం.. సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పిన్నెల్లి హాట్ టాపిక్ అయ్యారు. ప్రస్తుతం పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి నెల్లూరు జైలులో ఉన్నారు. ఇటీవల వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వెళ్లి అయన్ను పరామర్శించారు. పిన్నెల్లిని జైలు నుంచి బయటకు తీసుకొచ్చేందుకు వైసీపీ నుంచి పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరుగుతున్నాయి. అవసరమయితే సుప్రీంకోర్టుకు కూడా వెళ్లేందుకు వైసీపీ సిద్ధమవుతోంది. అయితే పిన్నెల్లి ఈ కేసు నుంచి తప్పించుకున్నా?.. జైలు నుంచి బయటకు వచ్చినా?.. ఆయన మళ్లీ కేసుల్లో ఇరుక్కోవడం తప్పదని?.. మళ్లీ జైలుకు వెళ్లడం ఖాయమని చర్చ జరుగుతోంది.
పిన్నెల్లి ఈవీఎంను ధ్వంసం చేయడంతో ఆయన్ను అరెస్ట్ చేయాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈక్రమంలో అజ్ఞాతంలోకి వెళ్లన పిన్నెల్లి.. ఆ తర్వాత హైకోర్టుకు వెళ్లి ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. ఆ తర్వాత సీఐ నారాయణ స్వామి.. టీడీపీ పోలింగ్ బూత్ ఏజెంట్ శేషగిరి ఫిర్యాదుతో పిన్నెల్లిపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. అదే సమయంలో హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్ కూడా రద్దు అయింది. దీంతో పోలీసులు పిన్నెల్లిని అరెస్ట్ చేయించి నెల్లూరు జైలుకు తరలించారు. అయితే పిన్నెల్లిని బయటకు తీసుకొచ్చేందుకు వైసీపీ నేతలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్ రద్దుపై.. అవసరమయితే సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు వైసీపీ నేతలు సిద్ధమవుతున్నవారు.
అయితే అటు పిన్నెల్లిని బయటకు తీసుకొచ్చేందుకు వైసీపీ ప్రయత్నాలు చేస్తుంటే.. ఆయన జైల్లోనే మగ్గేలా చేసేందుకు కూటమి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. గతంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా కొందరు టీడీపీ నేతలపై వరుస కేసులు పెట్టి వారికి ఊపిరాడనివ్వకుండా చేారు. దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ను వరుసగా కేసుల్లో ఇరికించారు. ఓ కేసులో బెయిల్ వచ్చి బయటికి వచ్చేలోపే.. మరో కేసు పెట్టి ఆయన్ను జైలుకు పంపించారు. వైసీపీ ప్రభుత్వం హయాంలో ఆయన ఎక్కువ రోజులు జైల్లోనే గడపాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే అప్పుడు ప్రభాకర్‌కు వచ్చిన పరిస్థితే.. ఇప్పుడు పిన్నెల్లి రామకృష్ణా రెడ్డికి కూడా వస్తుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. పిన్నెల్లి కూడా కేసుల చుట్టూ.. జైలు చుట్టూ తిరగడం తప్పదని తెలుస్తోంది.
ఇప్పటికే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డిపై నమోదయిన కేసులు కాకుండా మరో రెండు కేసులు ఉన్నాయి. వాటితో పాటు ఆయనకు సంబంధించిన కేసులను అన్నింటిని ప్రభుత్వం తవ్వుతున్నట్లు తెలుస్తోంది. ఓ మహిళలను దూషించడం.. కానిస్టేబుల్‌పై దాడి చేయడం వంటి కేసులు పిన్నెల్లిపై పెండింగ్‌లో ఉన్నాయి. ఒకవేళ పిన్నెల్లి బయటకు వస్తే.. కేసులను రీ ఓపెన్ చేసి తిరిగి ఆయన్ను జైలుకు పంపించే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో పిన్నెల్లికి ఊరట లభించినప్పటికీ.. మళ్లీ ఆయన జైలుకు వెళ్లడం ఖాయనే మాట వినిపిస్తోంది. మరి చూడాలి ముందు ముందు ఏం అవుతుందో..
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY