ఆస్ట్రేలియాలో జనసేన పార్టీ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొననున్న నాగబాబు, హైపర్ ఆది

Nagababu and Hyper Aadi will Participate in Janasena Party Formation Day Celebrations in Australia,Nagababu and Hyper Aadi,Janasena Party Formation Day,Janasena Party Celebrations in Australia,Mango News,Mango News Telugu,Nagababu And Hyper Aadi Travelling To Australia,Janasena Party Latest Updates,Andhra pradesh Politics,AP Janasena Party Latest News and Live Updates,AP Latest Political News,Janasena Party Live News,Janasena Party Celebrations Updates

ఆస్ట్రేలియాలో స్థిరపడిన ప్రవాస జనసైనికులు, వీర మహిళల ఆధ్వర్యంలో నిర్వహించనున్న జనసేన పార్టీ 10వ ఆవిర్భావ దినోత్సవం (మార్చి 14) వేడుకల్లో ముఖ్య అతిథిగా హాజరయ్యేందుకు జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు కొణిదెల నాగబాబు బుధవారం హైదరాబాద్ నుంచి ఆస్ట్రేలియాకు బయలుదేరారు. ఈ మేరకు జనసేన పార్టీ ఒక ప్రకటన విడుదల చేసింది. ఆస్ట్రేలియాలోని సిడ్నీ, మెల్ బోర్న్, బ్రిస్బేన్ తదితర ముఖ్య నగరాల్లో వారం రోజుల పాటు జరగనున్న ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో నాగబాబు పాల్గొని ప్రసంగిస్తారని, ముఖ్య కార్యకర్తలతో ముఖాముఖి సమావేశాల్లో పాల్గొంటారని తెలిపారు. అలాగే జనసేన పార్టీ నాయకులు తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్, హైపర్ ఆది నాగబాబుతో కలిసి ఆస్ట్రేలియాలో జరుగనున్న జనసేన ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో పాల్గొంటారని జనసేన పార్టీ ప్రకటనలో పేర్కొంది.

మరోవైపు మార్చి 14వ తేదీన జనసేన పార్టీ 10వ ఆవిర్భావ సభను కృష్ణా జిల్లాలోని మచిలీపట్నంలో నిర్వహించనున్నట్టు పార్టీ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. మార్చి 14వ తేదీన జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మంగళగిరి పార్టీ కార్యాలయం నుంచి వారాహిలో బయలుదేరి సభా ప్రాంగణానికి చేరుకుంటారని తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × 5 =