కర్నూలు జిల్లాలోని కీలకమైన అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒకటిగా బనగానపల్లె గురించి చెబుతారు.నిజానికి ఈ పేరు చెప్పగానే చాలామందికి పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి గుర్తుకు వస్తారు. అలాంటి మహిమాన్విత చరిత్ర ఉన్న బనగానపల్లెలో భారీ మెజారిటీతో బీసీ జనార్దన్ రెడ్డి విజయాన్ని సాధించారు. అయితే ఇప్పుడనే కాదు ఎన్నో ఏళ్లుగా అక్కడ బీసీ జనార్దన్ రెడ్డి తిరుగులేని లీడర్ గా కొనసాగుతూ వస్తున్నారు.
అంతేకాదు అక్కడివారిలో బీసీ జనార్దన్ రెడ్డి అంటేనే మాట తప్పని నాయకుడు అన్న కీర్తిని గడించారు. ఎన్నికలు వస్తుంటే ప్రజల్లోకి వచ్చే నేత కాదు నిరంతరంత ప్రజలతోనే ప్రజలకోసం ఉండే నాయకుడు అన్న నమ్మకాన్ని ఇచ్చారు. ఎప్పుడూ కూడా ప్రజల కోసం, ప్రజాసేవకై పరితపిస్తూ ఉంటాడు. అందుకే అక్కడి ఓటర్లు బీసీ జనార్ధన్ రెడ్డిని బనగానపల్లెకు బాస్‌ను చేశారు. కర్నూలు నియోజకవర్గంలోనే బనగాలపల్లి నియోజకవర్గాన్ని అద్భుతంగా తీర్చిదిద్దాలనే బాధ్యతను ఆయనమీద పెట్టారు.
బనగానపల్లె నియోజకవర్గం నుంచి ఇప్పటికే ఎంతోమంది నేతలు దేశ రాజకీయాల్లో చక్రం తిప్పారు. నియోజకవర్గంలో ఎప్పుడూ రెడ్ల పెత్తనమే ఉంటుంది. పార్టీ ఏదయినా సరే.. రెడ్డి నేతలు మాత్రమే ఎన్నికలలో పోటీ చేస్తారు. అలాంటి ఈ బనగానపల్లె నియోజకవర్గంలో బీసీ జనర్ధన్ మాత్రమే కాదు కాటసాని ఫ్యామిలీ కూడా బలంగానే ఉంది. ఈ నియోజకవర్గం నుంచి కాటసాని రామిరెడ్డి 2009 ప్రజారాజ్యం పార్టీ తరఫున విజయాన్ని సాధించగా, 2019లో వైసీపీ నుంచి గెలుపొంది రెండు సార్లు విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు.
మరోవైపు 2014లో బీసీ జనార్దన్ రెడ్డి టీడీపీ నుంచి పోటీ చేసి గెలుపొందారు. అయితే ఈ ఎన్నికలలో ఈ నియోజకవర్గంలో కాటసాని రామిరెడ్డి.. బీసీ జనార్దన్ రెడ్డి మధ్య విపరీతమైన పోటీ ఏర్పడినా చివరకు ఈ పోటీలో బీసీ జనార్దన్ రెడ్డి అద్భుతమైన మెజారిటీతో విజయం సాధించారు. ప్రస్తుతం ఏపీలో పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అంటూ పవన్ అభిమానులు ట్రెండ్ సెట్ చేయడంతో ఏపీ వ్యాప్తంగా అదే ట్రెండును ఫాలో అవుతున్నారు. గెలిచిన వ్యక్తుల పేర్లమీద ప్రజలు రకరకాల స్టికర్లు పెట్టుకుంటున్నారు. అలాగే ఇప్పుడు బనగానపల్లిలో గెలుపొందిన ఎమ్మెల్యే బీసీ జనార్ధన్ రెడ్డి తాలూకా అంటూ కూడా చాలామంది రాయించుకున్నారు.
ఇంతవరకూ బాగానే ఉన్నా..అభిమానులు సీమ సింహంగా పిలుచుకునే జనార్దన్ రెడ్డి..ఈ ఎన్నికల్లో గెలవడం కోసం ఎన్నో హామీలు ఇచ్చారు. ముఖ్యంగా మా అమ్మ మీద ఒట్టు అందరికీ రెండు సెంట్లు స్థలం ఇస్తానంటూ ఇచ్చిన హామీని ప్రజలు ఎక్కువగా నమ్మారు. ఎన్నో హామీలు ఇచ్చిన బీసీ జనార్దన్ రెడ్డి.. అద్భుతమైన మెజారిటీతో గెలవడంతో చంద్రబాబు కేబినెట్ లో రోడ్లు భవనాల శాఖకు మంత్రిగా ఎన్నికయ్యారు. దీంతో ఆయన ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తారా అన్న వాదన తెరమీదకు వచ్చింది. అమ్మ మీద ఒట్టు అందరికీ రెండు సెంట్లు స్థలం ఇస్తానంటూ ఇచ్చిన హామీని నెరవేర్చడం అంత ఈజీ కాదని ..మరి దీనికి బీసీ జనార్దన్ రెడ్డి ఎలాంటి సమాధానం ఇస్తారో వేచి చూడాలన్న వాదన వినిపిస్తుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE