జూనియర్ ఎన్టీఆర్, వైఎస్సార్ వర్శిటీలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ

Gannavaram MLA Vallabhaneni Vamsi Interesting Comments on YSR Varsity and Junior NTR, Gannavaram MLA Vallabhaneni Vamsi, Vallabhaneni Vamsi Comments on YSR Varsity and Junior NTR, YSR Varsity, Mango News, Mango News Telugu, Vallabhaneni Vamsi Interesting Comments On Jr. NTR, Vallabhaneni Vamsi, NTR Health University, Dr YSR Health Varsity, TDP Chief Chandrababu Naidu, AP Govt Name Change of NTR Health University After YSR, NTR Health University To YSR Varsity, Vallabhaneni Vamsi Latest News And Updates

గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ బుధవారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జూనియర్ ఎన్టీఆర్, వైఎస్సార్ వర్శిటీలపై మీడియా అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా వల్లభనేని వంశీ మాట్లాడుతూ.. విజయవాడలోని వర్సిటీకి స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ పేరు తొలగించినంత మాత్రాన ప్రజల్లో ఆయనపై ఉన్న అభిమానంలో ఎలాంటి మార్పు రాదని, అలాగే ఆ వర్సిటీకి దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ పేరు పెట్టినందువల్ల ఆయనపై కొత్తగా పుట్టుకొచ్చే అభిమానం కూడా ఉండదని వంశీ స్పష్టం చేశారు.

అలాగే జూనియర్ ఎన్టీఆర్ పైన కూడా వల్లభనేని పలు కీలక వ్యాఖ్యలు చేశారు. జూనియర్ ఎవరి అండదండలు లేకుండా స్వయంకృషితో ఎదిగారని, అయితే ప్రతి సమస్యలోకి ఆయనను లాగడం సరికాదని వంశీ అభిప్రాయపడ్డారు. ఇక టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకి సీనియర్ ఎన్టీఆర్ మీద నిజంగా ప్రేమ ఉంటే.. అధికారంలో ఉన్నప్పుడు గన్నవరంలోని విమానాశ్రయానికి ఆయన పేరు పెట్టి ఉండేవారని, భారత రత్నకు ఎన్టీఆర్ పేరు ప్రతిపాదించేవారని తెలిపారు. అంతే కాకుండా అవసరార్ధం చంద్రబాబు 2009లో జూనియర్ ఎన్టీఆర్ సేవలను వినియోగించుకుని, తర్వాత పక్కన పెట్టారని విమర్శించారు. కానీ సీఎం జగన్ అలా కాదని, ఆయనకు ఎన్టీఆర్ అంటే ఎంతో గౌరవం ఉందని, అందుకే ఎన్టీఆర్ పేరు మీద జిల్లా ఏర్పాటు చేశారని వల్లభనేని వంశీ గుర్తు చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

14 − 2 =