ఏపీ రాజకీయాల్లో కీలకమైన విజయనగరం జిల్లా నుంచి గజపతి కుటుంబం, బొబ్బిలి రాజులు, పెన్మత్స సాంబశివరాజు,బొత్స కుటుంబంతో సహా ఎంతోమంది బడా రాజకీయ నేతలు ప్రాతినిధ్యం వహించారు. ఉత్తరాంధ్ర ప్రాంతంలో ప్రత్యేక స్థానం ఉన్న ఉమ్మడి విజయనగరం జిల్లాలో.. మొత్తం 9 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. గతంలో కాంగ్రెస్, టీడీపీకి కంచుకోటగా ఉన్న ఈ జిల్లాలో.. 2014, 2019 ఎన్నికల నుంచి రాజకీయాలు రంగులు మారాయి. 2014లో టీడీపీ మెజార్టీ స్థానాల్ని దక్కించుకుంటే..2019లో మాత్రం వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది.
ఉమ్మడి విజయగనరం జిల్లాలో మొత్తం 9 అసెంబ్లీ స్థానం, ఒక లోక్ సభ నియోజకవర్గం ఉంది. ఈ జిల్లాలో 2014 ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ అత్యధికంగా 6 స్థానాల్లో విజయం సాధించగా.. వైసీపీ మూడు చోట్ల తమ ఖాతాను తెరిచింది. కానీ 2019 ఎన్నికల్లో అన్ని నియోజకవర్గాల్లోనూ విజయం సాధించిన వైసీపీ.. విజయనగరం లోక్‌సభ సీటును కూడా తన ఖాతాలో వేసేసుకుంది.
శ్రీకాకుళం జిల్లా పరిధిలో విజయనగరం లోక్‌సభ స్థానం ఒక్కటే ఉంది. 2019 ఎన్నికల్లో శ్రీకాకుళం ఎంపీగా వైసీపీ అభ్యర్థి బెల్లాన చంద్రశేఖర్ విజయం సాధించారు. 2024లో జరగబోతున్న ఎన్నికల్లో శ్రీకాకుళం లోక్‌సభ స్థానం నుంచి టీడీపీ,జనసేన,బీజేపీ కూటమి నుంచి టీడీపీ అభ్యర్థిగా కలిశెట్టి అప్పలనాయుడు బరిలో ఉన్నారు. వైసీపీ నుంచి సిట్టింగ్ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ బరిలో ఉండగా.. కాంగ్రెస్ పార్టీ నుంచి బొబ్బిలి శ్రీను పోటీ పడుతున్నారు.
ఉమ్మడి విజయనగరం జిల్లా పరిధిలో.. విజయనగరం, బొబ్బిలి, గజపతినగరం, కురుపాం, పార్వతీపురం, నెల్లిమర్ల, శృంగవరపుకోట,సాలూరు, చీపురుపల్లి ఉన్నాయి. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కలిసి పోటీ చేస్తుండగా.. మొత్తం 9 స్థానాల్లో టీడీపీ 8 చోట్ల పోటీ చేస్తోంది. నెల్లిమర్లలో మాత్రం జనసేన పార్టీ అభ్యర్థి పోటీ చేస్తున్నారు. వైసీపీ మాత్రం మొత్తం 175 నియోజకవర్గాల్లోనూ పోటీలో ఉంది.ఈ ఎన్నికల్లో వైసీపీ అధినేత, సీఎం జగన్.. సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మరోసారి అవకాశమిచ్చారు. 9 నియోజకవర్గాల్లోనూ సిట్టింగ్ ఎమ్మెల్యేలు పోటీలో ఉన్నారు.
టీడీపీ నుంచి పార్వతీపురంలో మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు బదులు బోనెల విజయచంద్ర పోటీలో ఉన్నారు. సాలూరులో గుమ్మడి సంధ్యారాణి బరిలో ఉండగా… చీపురుపల్లిలో టీడీపీ సీనియర్ నేత కళా వెంకట్రావు బరిలో ఉన్నారు. గజపతినగరంలో మాజీ ఎమ్మెల్యే కొండపల్లి అప్పలనాయుడు బదులు కొండపల్లి శ్రీనివాస్‌కు అవకాశం వచ్చింది. బొబ్బిలిలో సుజయ్‌కృష్ణ రంగారావు బదులు ఆయన సోదరుడు బేబీనాయన బరిలో ఉన్నారు. కురుపాంలో తొయ్యక జగదీశ్వరి పోటీ చేస్తున్నారు.దీంతో టీడీపీ కంచుకోట అయిన విజయనగరం జిల్లాలో ఈ సారి అదే సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందా లేక..గత ఎన్నికలలో లాగా వైసీపీ సీన్ కనిపిస్తుందా అన్న చర్చ జోరుగా సాగుతోంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY