ఆంధ్రప్రదేశ్ కేబినెట్ కీలక నిర్ణయాలు

Agriculture Council, Andhra Pradesh, Andhra Pradesh cabinet, AP Agriculture Council, AP Cabinet, AP Cabinet Approves Key Decisions, AP Cabinet Key Decisions, AP Cabinet Meet, AP Cabinet Meeting, AP CM YS Jagan, AP Local Body Elections, Local Body Elections, Mango News Telugu
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన ఫిబ్రవరి 12, బుధవారం ఉదయం సచివాలయంలో రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం జరిగింది. ఈ భేటీలో రాష్ట్రానికి సంబంధించి వివిధ అంశాలను దాదాపు గంటన్నరసేపు చర్చించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు, ఏపీ స్టేట్‌ అగ్రికల్చర్‌ కౌన్సిల్‌ ఏర్పాటు, జగనన్న విద్యాకానుక వంటి అంశాలపై కీలకంగా చర్చించారు. సమావేశం ముగిసిన అనంతరం మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలను రాష్ట్ర రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని నాని మీడియాకు వివరించారు.

ఆంధ్రప్రదేశ్ కేబినెట్ తీసుకున్న నిర్ణయాలు:

 • ఏపీ స్టేట్‌ అగ్రికల్చర్‌ కౌన్సిల్‌ ఏర్పాటు ముసాయిదా బిల్లుకు కేబినెట్ ఆమోదం
 • ఏపీ స్టేట్ ఫైనాన్సియల్ లిమిటెడ్ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం
 • మార్చి 15లోపు స్థానికసంస్థల ఎన్నికలు నిర్వహించాలని కేబినెట్‌ నిర్ణయం
 • నోటిఫికేషన్ వచ్చాక 15 రోజుల్లోపు ఎన్నికల ప్రక్రియ పూర్తిచేసేలా చట్టంలో మార్పులు
 • ఎన్నికల్లో డబ్బు, మద్యంతో అక్రమాలకు పాల్పడితే అనర్హత వేటుతో పాటుగా గరిష్టంగా మూడేళ్ళ వరకు జైలు శిక్ష
 • జెన్కో ఆధ్వరంలో 10 వేల మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు
 • లిఫ్ట్‌ ఇరిగేషన్‌ కోసం రూ.1500 కోట్ల సబ్సిడీని చెల్లించేందుకు కేబినెట్‌ ఆమోదం
 • పారిశుద్ధ్యం, పచ్చదనం బాధ్యతలను సర్పంచ్‌కే అప్పగిస్తూ నిర్ణయం
 • సర్పంచ్‌లు స్థానికంగా నివాసం ఉండేలా కొత్త నిబంధనలు తయారు
 • రైతుల ఉచిత విద్యుత్‌ కోసం రూ.8వేల కోట్లు కేటాయింపు
 • జగనన్న విద్యాకానుక పథకం ద్వారా 1-10వ తరగతి విద్యార్థులకు బ్యాగులతో పాటుగా మూడు జతల దుస్తులు, రెండు జతల బూట్లు, నోటు పుస్తకాలు ఇచ్చే అంశంపై చర్చ. 

Subscribe to our Youtube Channel Mango News for the latest News.

Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here