ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్సీపీ హయాంలో నియమించిన రెండున్నర లక్షలకు పైగా వాలంటీర్ల సర్వీసుల కొనసాగింపుపై కూటమి ప్రభుత్వం ఈ రోజు ఓ క్లారిటీ ఇచ్చింది. వైఎస్సార్సీపీ అధికారం కోల్పోయాక డైలమాలో పడిపోయిన వాలంటీర్ల సేవల కొనసాగించడంపై త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుంటామని మంత్రులు ఇప్పటికే చెబుతూ వచ్చారు.అయితే ఈ రోజు స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే పింఛన్ల పంపిణీ సందర్భంగా దీనిపై క్లారిటీ ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్‌లో ఈ రోజు రాష్ట్రవ్యాప్తంగా పింఛన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. ఉదయం 6 గంటల నుంచే వాలంటీర్లకు బదులు ఇప్పుడు సచివాలయ సిబ్బంది, తెలుగు దేశం పార్టీ నేతలు దగ్గరుండి మరీ పింఛన్ల పంపిణీని ప్రారంభించారు. ఈ రోజు సాయంత్రానికి వీలైతే 100 శాతం పింఛన్ల పంపిణీని పూర్తి చేసేయాలని ఏపీ ప్రభుత్వం టార్గెట్ కూడా పెట్టింది. అంతేకాదు సీఎం చంద్రబాబు నాయుడే స్వయంగా పెనుమాకలో లబ్దిదారుల ఇంటికెళ్లి పెన్షన్ పంపిణీ చేశారు.ఆ తర్వాత నిర్వహించిన బహిరంగసభలో చంద్రబాబు వాలంటీర్ల గురించి స్పందించారు.
వాలంటీర్లతో మాత్రమే పింఛన్ పంపిణీ చేయించాలనే మూర్ఖత్వంతో ఏప్రిల్, మే నెలల్లో అప్పటి వైఎస్సార్సీపీ గవర్నమెంటు..33 మంది లబ్దిదారులు చనిపోయే పరిస్థితిని తెచ్చిందని చంద్రబాబు ఈ సందర్బంగా గుర్తు చేశారు. అప్పట్లో తాము సచివాలయ సిబ్బందితో పింఛన్లు ఇప్పించాలని కోరినా వారు అలా చేయలేదని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.
కానీ తాము అధికారంలోకి వచ్చాక సచివాలయ సిబ్బందితో ఎందుకు పింఛన్ల పంపిణీ జరగదో చేసి చూపించాలనే పట్టుదలతోనే ఒకే రోజు వారితో ఇవాళ పంపిణీ చేయిస్తున్నామని చెప్పారు. అంతే కాదు అవసరం అనుకుంటే సచివాలయ సిబ్బందితో పాటు వాలంటీర్ల సహాయాన్ని కూడా తీసుకోవాలని చెప్పామని అన్నారు. ఈ మాటల ద్వారా సచివాలయ సిబ్బందికి తోడుగా వాలంటీర్లను కూడా వాడుకుంటున్నట్లు చంద్రబాబు స్పష్టం చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ