సహజ, ప్రకృతి వ్యవసాయ పద్ధతులపై నీతి ఆయోగ్‌ సదస్సు.. వీడియో కాన్పరెన్స్‌ ద్వారా పాల్గొన్న సీఎం జగన్‌

CM Jagan Participates in Niti Aayog's Agriculture Natural Farming Workshop Virtually, CM Jagan Virtually Participates in Niti Aayog's Agriculture Natural Farming Workshop, AP CM YS Jagan Mohan Reddy Virtually Participates in Niti Aayog's Agriculture Natural Farming Workshop, Niti Aayog's Agriculture Natural Farming Workshop, Agriculture Natural Farming Workshop, Niti Aayog's, workshop on Natural Farming, Niti Aayog's Agriculture Natural Farming Workshop News, Niti Aayog's Agriculture Natural Farming Workshop Latest News, Niti Aayog's Agriculture Natural Farming Workshop Latest Updates, Niti Aayog's Agriculture Natural Farming Workshop Live Updates, AP CM YS Jagan Mohan Reddy, AP CM YS Jagan, YS Jagan Mohan Reddy, YS Jagan, CM YS Jagan, AP CM, Mango News, Mango News Telugu,

ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా.. నీతి ఆయోగ్ సోమవారం ‘వినూత్న వ్యవసాయం’పై ఒక రోజు జాతీయ వర్క్‌షాప్‌ను నిర్వహించింది. దీనిలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయం నుంచి వీడియో కాన్పరెన్స్‌ ద్వారా ఈ సదస్సులో పాల్గొన్నారు. సదస్సులో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ తన అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ‘‘ఆంధ్రప్రదేశ్‌లో రైతులకు ప్రకృతి వ్యవసాయానికి అవసరమైన వనరులను ఆర్బీకే(రైతు భరోసా కేంద్రం) ద్వారా అందిస్తున్నామని పేర్కొన్నారు. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి కేంద్రం 90:10 నిష్పత్తిలో రాష్ట్రాలకు నిధులు అందించాలని చెప్పారు. ప్రయోగాత్మకంగా రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలలో సేంద్రీయ వ్యవసాయాన్ని సాగు చేయిస్తున్నామని తెలిపారు. ఈ క్రమంలో రసాయనిక వ్యవసాయం నుంచి సహజ వ్యవసాయం వైపు మళ్లడం వల్ల సాగు ఖర్చు గణనీయంగా తగ్గిందని, నేల ఆరోగ్యం మెరుగుపడుతుందని, మంచి దిగుబడి వచ్చిందని వెల్లడించారు.

సహజ, ప్రకృతి వ్యవసాయ పద్ధతులపై నిర్వహించిన సదస్సుకు నేతృత్వం వహించిన నీతి ఆయోగ్‌ వైస్‌ చైర్మన్‌ రాజీవ్‌ కుమార్, ప్రకృతి వ్యవసాయంలో ఆంధ్రప్రదేశ్ అనుభవాలను పంచుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఆర్బీకేలు అందిస్తున్న సేవలు అభినందనీయమని తెలిపారు. అలాగే ఆహార లోటు నుంచి ఆహార మిగులు దిశగా దేశం సాగిస్తున్న ప్రయాణం గురించి, రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడంపై దృష్టి సారించాల్సిన అవసరం గురించి ప్రస్తావించారు. తక్కువ పెట్టుబడితో, తగ్గిన కూలీ ఖర్చులను పరిగణనలోకి తీసుకుని సహజ వ్యవసాయం యొక్క ప్రయోజనాన్ని ఆయన ప్రస్తావించారు. సహజ వ్యవసాయ పద్ధతుల ద్వారా ఉత్పత్తి చేసే అగ్రికల్చర్ ఫుడ్స్.. రసాయనిక పర్యావరణ ప్రభావాన్ని తగ్గించడంతో పాటు రైతుల జీవనోపాధిని మెరుగుపరచడానికి ఎంతగానో తోడ్పడుతుందని తెలిపారు. నీతి ఆయోగ్ సహజ వ్యవసాయంపై అభివృద్ధి చేసిన ప్రత్యేక వెబ్‌సైట్‌ను రాజీవ్ కుమార్ గతేడాది ప్రారంభించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × 4 =