ఆంధ్రప్రదేశ్‌లో అధికార పార్టీ వైసీపీకి ఘోరా పరాభవం దిశగా ఫలితాల సరళి కనిపిస్తోంది. రాయలసీమలోనూ కూటమి జోరు కనిపిస్తోంది. సీఎం సొంత జిల్లాలోనూ వైసీపీకి కూటమి గట్టి పోటీ ఇస్తోంది. తూర్పుగోదావరి, గుంటూరు, కృష్ణా, విజయనగరం జిల్లాల్లో తెలుగుదేశం కూటమి క్లీన్ స్వీప్ చేస్తోంది. ఈ పరిణామాలన్నీ ఏపీలో ప్రస్తుత అధికార పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా అనుమానమే అన్న చర్చ జరుగుతోంది. ప్రతిపక్ష హోదాకు కావాల్సిన 18 సీట్లలో కూడా వైసీపీ లీడింగ్ లో కనిపించడం లేదు. ఇప్పటికే రాజమండ్రి రూరల్, రాజమండ్రి సిటీలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. ప్రస్తుతం 160 స్థానాల్లో కూటమి అభ్యర్థులు లీడ్‌లో కనిపిస్తున్నారు. 82 స్థానాలు ఉన్న రాయలసీమ జిల్లాల్లో కూడా కేవలం నాలుగు స్థానాల్లోనే ప్రస్తుతం వైసీపీ విజయం దిశగా వెళ్తోంది. ఇక ముఖ్యమంత్రి జగన్ మినహా.. మంత్రులు అందరూ వెనుకంజలోనే ఉన్నారు. నగరిలో వైకాపా అభ్యర్థి మంత్రి రోజాకు ఓటమికి తప్పేలా లేదు. వైసీపీ కీలక మంత్రులు బొత్స సత్యనారాయణ, అంబటి రాంబాబు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిల గెలుపు సైతం అనుమానమే అన్నట్లుగా ప్రస్తుతం ఫలితాల సరళి కనిపిస్తోంది.
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలను ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. తెలుగుదేశం కూటమి ప్రభంజనం సృష్టిస్తోంది. ఈ ప్రభంజనంలో వైసీపీ మంత్రులు అందరూ ఓటమి దిశగా పయనిస్తున్నారు. ఆయా నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులు ఆధిక్యత కనబరుస్తున్నారు. నగరిలో వైకాపా అభ్యర్థి మంత్రి రోజా వెనుకంజలో ఉన్నారు. తొలి రౌండ్ ముగిసేసరికి గురజాల తెదేపా అభ్యర్థి యరపతినేని 1311 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. అటు విజయనగరం జిల్లా చీపురుపల్లిలో వైసీపీ అభ్యర్ధి, రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ వెనుకంజలో ఉన్నారు. తొలుత మంత్రి ఆధిక్యంలో కొనసాగగా.. ఆ తర్వాత టీడీపీ అభ్యర్ధి కిమిడి కళా వెంకట్రావు ఆధిక్యంలో ఉన్నారు. అటు గాజువాక నుంచి పోటీ చేస్తున్న వైసీపీ అభ్యర్ధి గుడివాడ అమర్నాద్ కూడా వెనుకంజలో ఉన్నారు. అక్కడ టీడీపీ అభ్యర్ధి పల్లా శ్రీనివాసరావు ఆధిక్యంలో ఉన్నారు. ఇక సత్తెనపల్లిలో మంత్రి అంబటి రాంబాబు వెనుకంజలో ఉన్నారు. 25 మంది మంత్రుల్లో 24 మంది వెనుకంజలో ఉన్నారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఒక్కరే లీడింగ్ లో ఉన్నారు. పెనుగొండలో మంత్రి ఉషశ్రీ చరణ్, గుంటూరు వెస్ట్‌లో విడదల రజని, ఆముదాల వలసలో స్పీకర్ తమ్మినేని సీతారామ్ వెనుకంజలో ఉన్నారు. కొండపి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి, మంత్రి ఆదిమూలపు సురేష్ వెనుకంజలో ఉన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY