నవంబరు 13,14,15వ తేదీల్లో తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు

Andhra Pradesh, Mango News, No VIP break darshan for three days, Tirumala Tirupati, Tirumala Tirupati Devasthanams, TTD Cancels VIP Break Darshan, TTD Cancels VIP Break Darshan From November 13, TTD Cancels VIP Break Darshan From November 13 to 15 th, TTD VIP Break Darshan, VIP Break Darshan, VIP Break Darshan at Tirumala, VIP Break Darshan at Tirumala cancelled, VIP Break Darshan at Tirumala cancelled for three days

తిరుప‌తి న‌గ‌రంలో నవంబరు 14వ తేదీన ద‌క్షిణాది రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల స‌మావేశం ఉన్న నేప‌థ్యంలో నవంబరు 13, 14, 15వ తేదీల్లో తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలో బ్రేక్ ద‌ర్శ‌నాల‌ను టీటీడీ ర‌ద్దు చేసింది. ఈ మేరకు టీటీడీ ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ కారణంగా నవంబ‌రు 12, 13 14వ తేదీల్లో వీఐపీ బ్రేక్‌ దర్శనాల‌కు ఎలాంటి సిఫార్సు లేఖలు స్వీకరించబడవని తెలిపారు. అదేవిధంగా నవంబరు 13, 14, 15వ తేదీల్లో దాతలకు ఎలాంటి గదుల కేటాయింపు ఉండదని పేర్కొన్నారు. కావున భక్తులు ఈ విషయాన్ని గమనించి సహకరించవలసిందిగా టీటీడీ విజ్ఞప్తి చేసింది.

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన సదరన్‌ జోనల్‌ కౌన్సిల్‌ 29వ సమావేశం నవంబరు 14న తిరుపతిలో జరగనుంది. ఈ సమావేశ నిర్వహణకు ఏపీ ప్రభుత్వం అన్ని విధాలుగా సిద్ధమవుతోంది. ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, పుదుచ్చేరి నుంచి ముఖ్యమంత్రులు హాజరు కానున్నారు. ఈ కీలక సమావేశ పరిస్థితుల దృష్ట్యానే తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen − eleven =