
ప్రస్తుతం ఎక్కడ చూసినా లోక్‌సభ ఎన్నికల ఫలితాలపైనే చర్చ జరుగుతోంది. అయితే ఆకాశంలో సగం..అవకాశాలలో సగం అనే నినాదం మాటలకే కానీ చేతలలో కనిపించలేదని వాదన వినిపిస్తోంది. తాజాగా దేశంలో మహిళా ఎంపీల తగ్గడంపై పెద్ద ఎత్తున చర్చలు సాగుతున్నాయి. ఈ ఎన్నికల్లో మహిళల ఓటింగ్ శాతం పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి కానీ.. మహిళా ఎంపీలుగా ఎన్నికైనవారి సంఖ్య తగ్గడం విమర్శలకు దారి తీస్తోంది.
ఈ లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం మీద 73 మంది మహిళా అభ్యర్థులు ఎన్నికవగా, 2019 సార్వత్రిక ఎన్నికల్లో మహిళా అభ్యర్ధుల సంఖ్య 78 గా ఉంది. అయితే దేశవ్యాప్తంగా దిగువ సభకు ఎన్నికైన మొత్తం మహిళా ఎంపీ అభ్యర్ధులు 11 మంది పశ్చిమ బెంగాల్‌కు చెందిన వారే కావడం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. ఈ సార్వత్రిక ఎన్నికల్లో మొత్తం 797 మంది మహిళా అభ్యర్థులు బరిలోకి దిగగా, అత్యధికంగా బీజేపీ 69 మంది మహిళా అభ్యర్థులను, ఆ తర్వాత కాంగ్రెస్ 41 మంది మహిళా అభ్యర్థులను బరిలోకి దింపింది.
మరోవైపు తెలుగు రాష్ట్రాల నుంచి కేవలం ఐదుగురు మహిళలు మాత్రమే లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో ఇటీవల ముగిసిన లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి .. వివిధ రాజకీయ పార్టీల తరఫున సుమారు 15 మంది మహిళా అభ్యర్థులు బరిలో దిగారు. 15 మందిలో ఐదుగురు మాత్రమే విజయం సాధించారు. వీరిలో తెలంగాణ నుంచి ఇద్దరు, ఏపీ నుంచి ముగ్గురు గెలిచి పార్లమెంటుకు వెళ్తున్నారు. తెలంగాణ నుంచి సీనియర్ రాజకీయనేత.. కడియం శ్రీహరి కుమార్తె అయిన కడియం కావ్య, డీకే అరుణ గెలవగా..ఆంధ్రప్రదేశ్ నుంచి గుమ్మా తనూజా రాణి, బైరెడ్డి శబరి, దగ్గుబాటి పురంధేశ్వరి లోక్‌సభ ఎంపీలుగా గెలిచి పార్లమెంటుకు వెళుతున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY