అలా ఉంటది మరి పులసతోని అంటున్న గోదారోళ్లు

Know More About The Monsoon Legend Pulasa Fish and Its Origin Godavari Districts of AP,Know More About The Monsoon Legend Pulasa Fish,The Monsoon Legend Pulasa Fish,Pulasa Fish and Its Origin,Mango News,Mango News Telugu,East Godavari Pulasa Is A Monsoon Legend,Pulasa fish famous in Andhra Pradesh,Monsoon Seasons Favourite Fish,Pulasa Fish,Godavari Districts Pulasa Fish,Pulasa Fish,Pulasa Fish,Godavari Pulasa Fish,Godavari Districts of AP

పుస్తెలు అమ్మి అయినా సరే.. పులస తినాలనే సామెత ఏపీలో ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల్లో చాలా ఫేమస్. తొలకరి వానల తర్వాత గోదావరికి ఎర్ర నీరు పోటెత్తిన సమయంలోనే పులసలు వచ్చేస్తాయి. ఇక ఈ ఏడాది తాజాగా మార్కెట్‌లోకి మొదటి పులస వచ్చేసింది. వచ్చిన గంటల్లోనే రికార్డ్ ధరకు అమ్ముడుపోయింది. ఈ సీజన్‌లో తొలి పులస యానాంలో వేటకు వెళ్లిన మత్స్యకారులకు చిక్కింది. సుమారు మూడు కేజీలు బరువున్న చేప జాలర్లు వలకి చిక్కింది.

ఇక బహిరంగ మార్కెట్‌కు వచ్చిన తొలి పులసను.. 13 వేల రూపాయలకు చేపలు విక్రయించే తల్లి కూతుర్లు నాటి పార్వతి, ఆకుల సత్యవతి వేలం పాటలో దక్కించుకున్నారు. అనంతరం ఆ పులసను రెండు వేల లాభానికి భీమవరానికి చెందిన రాజుకు 15 వేలకు అమ్మారు. అరుదైన పులస చేపను జీవితంలో ఒక్కసారైనా రుచి చూడాలని ఆహార ప్రియులు ప్రధానంగా గోదావరి వాసులు భావిస్తుంటారు. అందుకేనేమో మార్కెట్లోకి పులస వస్తే చాలు.. ధర ఎంతైనా ఎగబడి మరీ కొనుగోలు చేస్తారు. అలా ఉంటది పులస క్రేజ్.

ఇక ఈ పులస చేపలకు ఒక ప్రత్యేకత ఉంది. ఇవి కేవలం గోదావరి నదిలో మాత్రమే దొరుకుతాయి. నదీ ప్రవాహానికి అతివేగంగా ఎదురీదడం ఈ చేపలకున్న విశిష్ట లక్షణమని మత్స్యకారులు చెబుతుంటారు. సంతానోత్పత్తి కోసం న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, టాంజానియా వంటి సుదూర ప్రాంతాల నుంచి ఖండాలను దాటి ఇవి వస్తాయట. అలా హిందూ మహాసముద్రం మీదుగా ప్రయాణించి బంగాళాఖాతంలో ప్రవేశిస్తాయని స్థానికులు, నిపుణులు చెబుతున్నారు. అయితే పులస చేప సంతానోత్పత్తి సమయంలో గుడ్లు పెట్టేందుకు ఉభయ గోదావరి జిల్లాల ద్వారా సముద్ర జలాల్లోకి వస్తుందట. సీజనల్‌గా ఆషాడ, శ్రావణ మాసాల్లో మాసాల్లో ఇక్కడ గుడ్లు పెట్టి మళ్లీ సముద్రంలోకి తిరిగి వెళ్లిపోతుందట. ఇలసగా పిలిచే ఈ చేప గోదావరిలోకి ఎర్రనీరు రాగానే.. ఎదురీదుతూ నదిలోకి వచ్చి రెండు మూడు రోజుల్లోనే పులసగా మారుతుందని చెబుతారు మత్స్యకారులు.

ఇక ఈ పులసలు ఒడిశాతోపాటు బంగ్లాదేశ్ తీరాల్లో కూడా దొరుకుతాయి. కానీ గోదావరిలో దొరికే చేపల రుచి వేరుగా ఉంటుందని మత్స్య ప్రియులు చెబుతారు. ఉభయ గోదావరి జిల్లాల్లో ఎక్కువగా భైరవపాలెం, అంతర్వేది, నరసాపురంలో కనిపిస్తాయి. ముఖ్యంగా గోదావరి జలాలు సముద్రంలో కలిసే ఈ రెండు పాయల దగ్గరే పులస చేపలు అధికంగా లభ్యమవుతాయి. అందుకే పోటీ పడి మరీ జాలర్లు వేటకు వెళ్తారు. గంగపుత్రులకు కనివిని ఎరుగని లాభాలు తెచ్చిపెట్టడం ఈ పులసల ప్రత్యేకత. ఇంకేందుకు ఆలస్యం సీజన్ ఎలాగూ మొదలైంది. మీరూ ఓ ప్రయత్నం చేయండి. పులస రుచులను ఆస్వాదించండి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty − 7 =