కోర్టుల చుట్టూ వైసీపీ నేతలు

YCP Leaders Are Going Round The Courts Seeking Anticipatory Bail,YCP Leaders Are Going Round The Courts,YCP Leaders,The Courts Seeking Anticipatory Bail,Bail,YCP, AP, Jagan Mohan Reddy,,Pinnelli Ramakrishna Reddy Arrested,High Court, Anticipatory Bail, Arrest, EVM Destruction, High Court, Legal Proceedings, Palnadu District, Pinnelli Ramakrishna Reddy, Police Custody, TDP Polling Agent, Vaikapa,AP Politics, Political News,Mango News
ycp, ycp leaders, ap, jagan mohan reddy

ఏపీలో గత అయిదేళ్లు వైసీపీ అధికారంలో ఉంది. ఆ అయిదేళ్లు వైసీపీ పాలకులకు అడ్డు చెప్పేవారే లేరు. వారు అన్నదే సాగేది. ఈక్రమంలో కొందరు వైసీపీ లీడర్లు ప్రభుత్వం అండ చూసుకొని ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరించారు. అంతేకాకుండా ప్రతిపక్ష నాయకులపై దాడులు కూడా చేయించారు. 2021లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇంటిపై కూడా దాడులు చేసేందుకు యత్నించారు. అయితే ఇప్పుడు ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో.. ఆ నేతల గుండెల్లో రైళ్లు పరుగెత్తుతున్నాయి. ఎక్కడ అరెస్ట్ చేస్తారేమోనని.. ఎక్కడ జైలుకు వెళ్లాల్సి వస్తుందోమోనని బిక్కుబిక్కుమంటున్నారు. ఈ మేరకు ముందస్తు బెయిల్ కోసం కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు.

ఇప్పటికే వైసీపీ నేత, మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరికొంత మంది వైసీపీ లీడర్లను కూడా కూటమి ప్రభుత్వం టార్గెట్ చేసిందని.. త్వరలోనే వారిని అరెస్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈక్రమంలో గతంలో వైసీపీ ప్రభుత్వ అండ చూసుకొని రెచ్చిపోయిన నేతలంతా.. ఇప్పుడు ముందస్తు బెయిల్ కోసం కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ సలహాదారుగా సజ్జల రామకృష్ణా రెడ్డి ఓ వెలుగు వెలిగారు. ప్రభుత్వ సలహాదారుగా రాష్ట్ర ప్రభుత్వ అధికారాలను తన గుప్పిట్లో పెట్టుకున్నారని రామకృష్ణారెడ్డిపై ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే ఆయనపై కేసు కూడా ఫైల్ అయింది. దీంతో ఆయన ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నాలు మొదలు పెట్టారు. కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు.

అటు 2021లో మాజీ మంత్రి జోగి రమేష్ చంద్రబాబు నాయుడి ఇంటిపై దాడికి ప్రయత్నించారు. తన తనుచరులతో కలిసి దాడిచేసేందుకు యత్నించారు. ఈక్రమంలో ఆయన్ను అరెస్ట్ చేయించాలని ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందట. దీంతో జోగి రమేష్ అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించారు. అటు మంగళగిరిలోని తెలుగు దేశం పార్టీ ఆఫీస్‌పై జరిగిన దాడిని ప్రోత్సహించారంటూ విజయవాడకు చెందిన దేవినేని అవినాష్.. గుంటూరుకు చెందిన లేళ్ల అప్పిరెడ్డిలకు అరెస్టు ప్రమాదం పొంచి ఉంది. ఈక్రమంలో వారు కూడా ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నాలు మెదలు పెట్టారట. వీరేకాకుండా మరికొంత మంది వైసీపీ లీడర్లు కూడా కేసులు.. అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు మార్గాలను అన్వేశిస్తున్నారట.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE