ఏపీలో జూన్ 7 నుంచి 16 వరకు పదో తరగతి పరీక్షలు, షెడ్యూల్ విడుదల

AP 10th Class Exams, AP 10th Class Exams Dates, AP 10Th Class Exams Schedule, AP Govt Releases SSC Exams, AP Govt Releases SSC Exams Schedule, AP Govt Releases SSC Exams Schedule Today, AP SSC Exams, AP SSC Exams 2021, AP SSC Exams New Schedule, AP SSC Exams News, AP SSC Exams Schedule, AP SSC Exams Schedule Released, AP SSC Exams Updates, Mango News

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ ఖరారైంది. ఈ మేరకు ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఫిబ్రవరి 3, బుధవారం నాడు పదో తరగతి పరీక్షల షెడ్యూల్ ను విడుదల చేశారు. జూన్ 7, 2021 నుంచి జూన్ 16, 2021 వరకు పరీక్షలు జరగనున్నాయి. అలాగే ఆయా తేదీల్లో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలను నిర్వహించనున్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రత్యక్ష తరగతుల నిర్వహణ ఆలస్యమవడం, విద్యాసంవత్సరాన్ని కుదించడంతో ఈసారి పదో తరగతిలో 7 పేపర్లతో పరీక్షలు నిర్వహణకు ఏర్పాట్లు చేస్తునట్టు తెలిపారు.

ఏపీలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్:

  • జూన్ 7 : ఫస్ట్ లాంగ్వేజ్‌ గ్రూప్-A, ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్-1 (కంపోజిట్ కోర్సు)
  • జూన్ 8 : సెకండ్ లాంగ్వేజ్‌ పేపర్
  • జూన్ 9 : ఇంగ్లీష్ పేపర్
  • జూన్ 10 : మ్యాథమేటిక్స్ పేపర్
  • జూన్ 11 : జనరల్ సైన్స్ – ఫిజికల్ సైన్స్‌ పేపర్
  • జూన్ 12 : జనరల్ సైన్స్ – బయోలాజికల్ సైన్స్ పేపర్
  • జూన్ 14 : సోషల్ స్టడీస్ పేపర్
  • జూన్ 15 : ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్-2 (కంపోజిట్ కోర్సు), ఓఎస్‌ఎస్సీ మెయిన్ లాంగ్వేజ్‌ పేపర్-1 (సంస్కృత, అరబిక్, పర్షియన్ సబ్జెక్ట్స్)
  • జూన్ 16 : ఓఎస్‌ఎస్సీ మెయిన్ లాంగ్వేజ్‌ పేపర్-2 (సంస్కృత, అరబిక్, పర్షియన్ సబ్జెక్ట్స్), ఒకేషనల్ కోర్స్‌ (థియరీ).

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here