కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి కొలువు దీరడంలో తెలుగు దేశం పార్టీ కీలకంగా మారిన విషయం తెలిసిందే. మ్యాజిక్ ఫిగర్ కంటే తక్కువ స్థానాలు బీజేపీకి దక్కడంతో టీడీపీ ఎంపీలు కీలకంగా మారారు. అయితే ఇప్పుడు రాజ్యసభలోనూ బీజేపీకి బలం తగ్గింది. ఈక్రమంలో ఇతర పార్టీల ఎంపీలపై బీజేపీ ఆధారపడుతోంది. ప్రస్తుతం రాజ్యసభలో వైసీపీకి 11 మంది ఎంపీల బలం ఉంది. దీంతో బీజేపీ రాజ్యసభలో తమ బలం పెంచుకునేందుకు వైసీపీని ఆశ్రయించేందుకు సిద్ధమవుతోంది. అటు వైసీపీ కూడా రాజ్యసభలో బీజేపీకి మద్ధతు ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. ఒకవేళ ఇదే జరిగితే కేంద్రంలో వైసీపీ వాల్యూ తిరిగి పెరుగుతుంది. అలాగే కేంద్రం అండతో రాష్ట్రంలో తిరిగి వైసీపీ పుంజుకునే అవకాశాలు ఉన్నాయి.
ఈసమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నారు. వైసీపీకి ఎటువంటి ఛాన్స్ ఇవ్వకుండా ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా వైసీపీ రాజ్యసభ ఎంపీలను తమవైపు లాక్కునేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. వైసీపీ ఎంపీలను తమవైపు లాక్కొని రాజ్యసభలో కూడా బీజేపీకి మద్ధతు ఇవ్వాలని చూస్తున్నారు. ఇలా చేయడం ద్వారా లోక్ సభ మాదిరిగానే.. రాజ్యసభలో కూడా టీడీపీకి ప్రాధాన్యత పెరుగుతుంది. అలాగే వైసీపీని మరోసారి దెబ్బ తీసినట్లు అవుతుంది. అందుకే చంద్రబాబు నాయుడు వైసీపీ రాజ్యసభ ఎంపీలతో టచ్‌లోకి వెళ్లారట. తమ పార్టీలోకి ఆహ్వానించారట. అటు వైసీపీ రాజ్యసభ ఎంపీలు కూడా తెలుగు దేశం పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఏపీలో వైసీపీ అధికారం కోల్పోవడం.. కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కకపోవడంతో వైసీపీ ఎంపీలు అయోమయంలో పడిపోయారు. ఏం చేయాలో వారికి పాలుపోవడం లేదు. ఇదే సమయంలో చంద్రబాబు నాయుడు స్వయంగా వారిని ఆహ్వానించడంతో జంప్ అయ్యేందుకు వారు సిద్ధమవుతున్నారట. టీడీపీలో చేరడం ద్వారా రాష్ట్రంలో తమ ప్రయోజనాలు నెరవేరుతాయని వారు భావిస్తున్నారట. అంతేకాకుండా రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీలో ఉంటే తమకు మైలేజ్ కూడా పెరుగుతుందని అనుకుంటున్నారట. నెల్లూరుకు చెందిన బీద మస్తాన్ రావు, విశాఖకు చెందిన గొల్ల బాబూరావు, కడపకు చెందిన మేడ మల్లికార్జున రావులతో పాటు మరికొంత మంది కూడా టీడీపీలో చేరేందుకు సిద్ధమవుతున్నవారు. ఇటీవల చంద్రబాబు కూడా ఇదే విషయంపై బీజేపీ పెద్దలతో చర్చించేందుకు వెళ్లారని జోరుగా ప్రచారం జరుగుతోంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE