రాజ్యసభ ఎన్నికలు: ఎన్నికలు జరిగిన నాలుగు స్థానాలు కైవసం చేసుకున్న వైసీపీ

Andhra Pradesh Rajya Sabha Elections, AP News, AP Political Updates, AP Rajya Sabha Elections, Mango News Telugu, Rajya Sabha Elections, Rajya Sabha Elections In Andhra Pradesh, Rajya Sabha Elections In AP, Rajya Sabha Elections Polling, YCP Wins All Four Seats in Rajya Sabha Elections

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నాలుగు రాజ్యసభ స్థానాలకు జూన్ 19, శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. సాయంత్రం 5 గంటలకు ఓట్ల లెక్కింపు పక్రియ మొదలవగా, ఎన్నికలు జరిగిన నాలుగు స్థానాలను వైసీపీ పార్టీ కైవసం చేసుకొని ఘనవిజయం సాధించింది. అధికార వైసీపీ పార్టీ నుంచి బరిలోకి దిగిన ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, పరిమళ్‌ నత్వానీ, మోపిదేవి వెంకటరమణ విజయం సాధించారు.

ఈ ఎన్నికల్లో మొత్తం 175 ఎమ్మెల్యేలకు గానూ 173 మంది ఓటు హక్కును వినియోగించుకోగా గెలిచిన ఒక్కో అభ్యర్థికి 38 ఓట్లు వచ్చాయి. నాలుగు ఓట్లు చెల్లుబాటు కాలేదని పేర్కొన్నారు. మరోవైపు టీడీపీ పార్టీ నుంచి బరిలోకి దిగిన వర్ల రామయ్యకు 17 ఓట్లు వచ్చాయి. ముందుగా రాష్ట్రంలో నాలుగు స్థానాలకు ఐదుగురు అభ్యర్థులు బరిలో ఉండడంతో ఎన్నికలు అనివార్యమయ్యాయి, అయితే అందరూ ఊహించినట్టుగానే అధికార వైసీపీ నాలుగు స్థానాలను కైవసం చేసుకుంది.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu