విశాఖ వైసీపీ ఎంపీగా పోటీ చేయాలా ..వద్దా?

Botsa Jhansi in Confusion, Jhansi in Confusion, Botsa Jhansi confusion, Botsa Jhansi, Visakha MP,YCP, Contest as MP, Botsa Satyanarayana, MVV Satyanarayana, YS Jagan, CM Jagan, AP Live Updates, Andra Pradesh, Political News, Mango News, Mango News Telugu
Botsa Jhansi confusion,Botsa Jhansi, Visakha MP,YCP,contest as MP, Botsa Satyanarayana, MVV Satyanarayana, YS Jagan

అందరి కంటే ముందే అభ్యర్థులను ప్రకటించేశాం.. ప్రచారాలలో ఇక దూసుకుపోవడమే తరువాయి అని ఏపీ సీఎం జగన్ భావించారు. కానీ వాస్తవ పరిస్థితులు అందుకు అనుకూలంగా లేకపోవడంతో ఇప్పుడు కేడర్ నుంచి సీఎం వరకూ అయోమయంలో పడుతున్నారు. అయితే ఇదంతా పడిపోయిన వైసీపీ గ్రాఫ్ మహిమ అని కొంతమంది అంటుంటే..కాదు కాదు వైసీపీ  స్వయంకృతాపరార్ధం అని మరికొంతమంది అభిప్రాయపడుతున్నారు.

నిజమే..చాలా నియోజకవర్గాల్లో సీఎం జగన్ వైసీపీ ఇన్చార్జ్‌లను నియమించడం.. వారం పది రోజులు తిరగకుండానే వారిని మార్చడం.. వారి స్థానాలలో కొత్త ఇంచార్జ్‌లను  ఎంపిక చేయటమే జరుగుతుంది. ఇటు ఎన్నికలకు రెండు నెలలు కూడా సమయం లేదు. అయినా ఏమాత్రం పట్టనట్లు ఇష్టం వచ్చినట్టు మార్పులు చేర్పులు చేసుకుంటూ వెళుతుండటంతో వైసీపీలో అసంతృప్త రాగాలు పెరిగిపోతున్నాయి. ఈ అయోమయంతోనే  కొన్నిచోట్ల అభ్యర్థులు ఇంకా ప్రచారం కూడా ప్రారంభించకుండా మీనమేషాలు లెక్కపెడుతుండటం ఓటర్లను ఆశ్చర్యంలో పడేస్తుంది.

అలా ఉత్తరాంధ్రలో చాలా కీలకమైన విశాఖ లోక్‌సభ నియోజకవర్గ ఇన్చార్జిగా .. మంత్రి బొత్స సత్యనారాయణ భార్య ఝాన్సీ లక్ష్మీని సీఎం జగన్ నియమించారు. ఝాన్సీ గతంలో రెండుసార్లు ఎంపీగా పని చేసిన అనుభవం ఉంది.  ఆమెను విశాఖ ఇన్చార్జిగా నియమించి నెల రోజులు దాటినా.. ఇంకా ప్రచారం ప్రారంభించకపోవడంపై స్థానికంగా సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఝాన్సీ ప్రచారానికి ఆసక్తి చూపించకపోవడంతో విశాఖ జిల్లాలో పార్టీ నేతలు.. కార్యకర్తల్లో అయోమయం నెలకొంది.

2019 ఎన్నికలలో విశాఖ నుంచి వైసీపీ ఎంపీగా గెలిచిన ఎం.వి.వి సత్యనారాయణను .. విశాఖ తూర్పు అసెంబ్లీ నియోజకవర్గానికి ఇన్చార్జ్‌గా జగన్ నిర్ణయించారు. తూర్పు నియోజకవర్గ  ఇన్చార్జ్‌గా ఉన్న అక్రమాని విజయనిర్మలను తొలగించి ఎం.వి.వి సత్యనారాయణని ఆరు నెలల కిందట ఇన్చార్జ్‌గా నియమించారు.  దీంతో విశాఖ ఎంపీ అభ్యర్థి కోసం చూసిన జగన్ ..లోకల్‌గా బలమైన అభ్యర్థులెవరు కనిపించకపోవడంతో ..విజయనగరం నుంచి ఝాన్సీ లక్ష్మీని పిలిచి అక్కడ ఇన్చార్జ్‌గా నియమించారు. దీంతో వచ్చే ఎన్నికలలో  ఎంపీగా పోటీ చేయటం ఖాయమని అంతా అనుకున్నారు. అయితే ఆమె ఇప్పటి వరకు కూడా ప్రజల్లోకి వెళ్లలేదు. కనీసం విశాఖ పార్లమెంటు పరిధిలో ఉన్న లీడర్స్‌ను  కూడా కలిసే ప్రయత్నం చేయ లేదు.

సాధారణంగా సిటీకి కొత్త వ్యక్తిని ఇన్చార్జ్‌గా నియమిస్తే వాళ్లు త్వరగా.. జనాల్లోకి వెళ్లి పరిచయాలు పెంచుకోవడానికి ప్రయత్నిస్తారు. కానీ మంత్రిగా ఉన్న బొత్స సత్యనారాయణ గాని.. రెండుసార్లు ఎంపీగా పనిచేసిన ఆయన సతీమణి ఝాన్సీ లక్ష్మి గాని ఇప్పటివరకు అలాంటి ప్రయత్నాలేమీ చేయలేదు. ఎవరైనా ఝాన్సీ ఎప్పటినుంచి ప్రచారం ప్రారంభిస్తారని మంత్రి బొత్సను అడిగితే ..ఇంకా టైముంది కదా అని తప్పించుకుంటున్నారన్న ప్రచారం జరుగుతోంది.

ఇదిలా ఉంటే 2019 ఎన్నికల్లో వైసీపీ గాలి ఓ రేంజ్‌లో వీస్తున్నా కూడా విశాఖ లోని నాలుగు అసెంబ్లీ స్థానాలను టీడీపీ గెలుచుకుంది. ఈ సారి ఎన్నికలలో  జనసేన, టీడీపీ పొత్తుతో వెళుతున్నాయి. అయితే దీంతోనే బొత్స ఫ్యామిలీ ప్రచారానికి వెనుకడుగు వేస్తున్నారన్న వార్తలు షికార్లు కొడుతున్నాయి.ఏపీలో వైసీపీ పరిస్థితి ఘోరంగా ఉందని..ప్రజలంతా పార్టీకి ఏమాత్రం సానుకూలంగా లేరన్న బొత్స చేయించుకున్న సర్వేలలో  వెల్లడవడంతోనే ఈ వెనుకడుగు అని తెలుస్తోంది.అనవసర ఖర్చు తప్ప ఒరిగేందేమీ ఉండదన్న లెక్కలతో..అసలు  విశాఖ నుంచి ఎంపీ అభ్యర్థిగా తన భార్యను పోటీకి దింపాలా వద్దా అన్న డైలామాలో బొత్స  ఉన్నట్టు ప్రచారం జరుగుతుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

six + five =