ఏపీలో తిరుమల తిరుపతి లడ్డు వ్యవహారం పై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేస్తున్న దీక్షలు, సనాతన ధర్మ బోర్డు కావాలంటూ ప్రతిపాదనలు తీసుకురావడంతో ఇప్పుడు ఆ అంశం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. అయితే పవన్ వ్యాఖ్యలకు ఎంత మద్దతు లభిస్తోందో అంతే వ్యతిరేకత కూడా వస్తోంది. ఈ నేపథ్యంలో పవన్ ను ట్వీట్లతో టార్గెట్ చేస్తున్న నటుడు ప్రకాష్ రాజ్ తన వార్ కొనసాగిస్తున్నారు. “గెలిచే ముందు ఒక అవతారం.. గెలిచిన తర్వాత ఇంకో అవతారం.. ఏంటీ అవాంతరం.. ఎందుకు మనకీ అయోమయం.. ఏది నిజం?’’ అని ప్రకాశ్‌రాజ్ గురువారం ట్వీట్ చేశారు. ఇది కూడా కల్యాణ్‌ను ఉద్దేశించే అని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ట్వీట్ కూడా వైరల్ అవుతోంది.
కాగా ప్రకాష్ రాజ్ ఈ అంశపై మరోసారి ట్వీట్ చేసాడు. ఇందులో మనకేం కావాలి…అంటూ ప్రశ్నించారు. ప్రజల్లో భావోద్వేగాలను రెచ్చగొట్టి ..తద్వారా రాజకీయ లబ్ధిని సాధించటమా..?, లేక ప్రజల మనోభావాలు గాయపడకుండా..పరిపాలనా సంబంధమైన ..అవసరమైతే తీవ్రమైన చర్యలతో.. సున్నితంగా సమస్యను పరిష్కరించుకోవటమా..? జస్ట్ ఆస్కింగ్ అంటూ ప్రకాష్ రాజ్ ప్రశ్నించారు. తద్వారా బాధ్యతాయుత డిప్యూటీ సీఎం స్ధానంలో ఉన్న పవన్ కళ్యాణ్ లడ్డూ వివాదంలో తన వ్యాఖ్యలతో ప్రజల్లో భావోద్వేగాలను రెచ్చగొడుతున్నారని ప్రకాష్ రాజ్ చెప్పకనే చెప్పారు. దీని ద్వారా రాజకీయ లబ్ది సాధించాలని భావిస్తున్నారా లేక సున్నిత సమస్యను పరిష్కరించాలనుకుంటున్నారా అని సూటిగానే పవన్ ను ప్రశ్నించారు.
బాధ్యతాయుత డిప్యూటీ సీఎం స్ధానంలో ఉన్న పవన్ కళ్యాణ్ లడ్డూ వివాదంలో తన వ్యాఖ్యలతో ప్రజల్లో భావోద్వేగాలను రెచ్చగొడుతున్నారని ప్రకాష్ రాజ్ చెప్పకనే చెప్పారు. దీని ద్వారా రాజకీయ లబ్ది సాధించాలని భావిస్తున్నారా లేక సున్నిత సమస్యను పరిష్కరించాలనుకుంటున్నారా అని సూటిగానే పవన్ ను ప్రశ్నించారు. తిరుమల లడ్డూ వ్యవహారం తెరపైకి వచ్చాక మొదట్లో అంతగా స్పందించని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆ తర్వాత మాత్రం సీఎం చంద్రబాబును మించి దూకుడుగా వ్యాఖ్యలు చేశారు. కాగా ప్రకాష్ రాజ్ ట్వీట్లపై పవన్ ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది.