ఏపీలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ఫలితాలు విడుదల

2021 AP Intermediate Results, AP Inter 2nd Year Results, AP Inter 2nd Year Results 2021, AP Inter Results 2021, AP Intermediate, AP Intermediate 2021 Results, AP Intermediate 2nd Year Results, AP Intermediate 2nd Year Results to be Released, AP Intermediate 2nd Year Results to be Released Tomorrow, AP Intermediate Board, Inter 2nd Year Results, Mango News

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ఫలితాలు నేడు విడుదల అయ్యాయి. ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ విజయవాడలో విడుదల చేశారు. ద్వితీయ సంవత్సరంలో ఉన్న మొత్తం 5,08,672 విద్యార్థులందరూ పాస్‌ అయినట్లు తెలిపారు. ప్రథమ సంవత్సరంలో ఫెయిల్ అయి, పరీక్ష ఫీజు చెల్లించిన విద్యార్థులను కనీస 35 మార్కులతో పాస్ చేశామని చెప్పారు. అలాగే ప్రాక్టికల్‌ పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థులను కూడా పాస్ చేశామన్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో పరీక్షల వాయిదా పడిన అనంతరం సుప్రీంకోర్టు సూచనలతో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలను ప్రభుత్వం రద్దు చేసినట్టు తెలిపారు.

ఫలితాలకు సంబంధించి విధి విధానాలను రూపకల్పన కోసం హైపవర్ కమిటీని ఏర్పాటు చేశామని, కమిటీ నివేదిక ఆధారంగా పదవ తరగతిలో ఎక్కువ మార్కులు సాధించిన మూడు సబ్జెక్ట్‌ల నుంచి 30 శాతం, ఇంటర్ మొదటి ఏడాది మార్కుల్లో 70 శాతం వెయిటేజ్‌తో ఫలితాలు విడుదల చేస్తున్నామని అన్నారు. ఈ ఫలితాలపై సంతృప్తి చెందని విద్యార్థులకు కరోనా పరిస్థితులు తగ్గాక పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఫలితాలను results.bie.ap.gov.in, examresults.ap.ac.in, bie.ap.gov.in, results.apcfss.in వెబ్‌సైట్లలో అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు. మరోవైపు పదవతరగతి ఫలితాలను కూడా వారం రోజులలో ప్రకటిస్తామని మంత్రి మంత్రి ఆదిమూలపు సురేష్‌ వెల్లడించారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here