డాన్స్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పేరు ఇప్పుడు మీడియాలో తెగమారు మోగిపోతుంది. మొన్నటివరకు డ్యాన్స్ మాస్టర్ గా ఎన్నో సినిమాలకు డ్యాన్స్ కంపోజ్ చేసిన ఆయన జాతీయ స్థాయిలో అవార్డును కూడా అందుకున్నాడు.కానీ ఎప్పుడయితే తనను లైంగికంగా వేధించారంటూ జూనియర్ కొరియోగ్రాఫర్ ఫిర్యాదు చేసిందో ..అప్పటి నుంచి రోజుకో ట్విస్ట్ వెలుగు చూస్తుంది.
మాస్టర్ దగ్గర అసిస్టెంట్ గా జాయిన్ అయిన మహిళా కొరియోగ్రాఫర్ను లైంగిక వేధింపులకు గురి చేయడంతో ఆయన అసలు రంగు బయటపడింది. పైకి నవ్వుతూ కనిపించే మాస్టర్ ..తన కోరికను తీర్చుకోవడం కోసం వయసు, పేరు మర్చిపోయి ప్రవర్తించారంటూ కొత్త వార్తలు వినిపిస్తున్నాయి.
బాధితురాలి ఫిర్యాదుతో జానీ మాస్టర్, అలియాస్ షేక్ జానీ బాషాపై అత్యాచారం కేసు నమోదు అయింది. ఔట్ డోర్ షూటింగులలో కూడా తనపై అత్యాచారం చేశాడని యువతి పేర్కొంది. జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి నార్సింగ్ పోలీస్ స్టేషన్‌కి కేసును ట్రాన్స్‌ఫర్ చేశారు. మహిళపై అనేకసార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడనే ఫిర్యాదుతో రాయదుర్గం స్టేషన్ పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. సెక్షన్ 376 రేప్ కేసుతో పాటు క్రిమినల్ బెదిరింపు (506), గాయపరచడం(323) క్లాజ్ (2) సెక్షన్ల కింద పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.
అయితే ఈ కేసులో విచారిస్తున్న పోలీసులకు.. మరిన్ని షాకింగ్ నిజాలు తెలుస్తున్నాయి. జానీ మాస్టర్ అమ్మాయిలను లైంగికంగా వేదింపులకు గురి చేశాడని వీరి విచారణలో బయటపడింది. గతంలో కూడా జానీపై చాలా కేసులు ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఏ భార్య అయిన తన భర్త తప్పు చేస్తే అందులోనూ పరాయి మహిళ వైపు కన్నెత్తి చూస్తేనే అస్సలు ఊరుకోదు.. కానీ ఈయన భార్య మాత్రం దగ్గరుండి భర్తతో దారుణాలు చేయించేదని బాధిత మహిళ ఇచ్చిన స్టేట్మెంట్ తో బయటపడింది.భార్యాభర్తలు కలిసే తనను వేధింపులకు గురి చేసినట్లు ఆమె బయట పెట్టింది.
అయితే నిన్నటి నుంచి జానీ మాస్టర్ పరారీలో ఉన్నట్లు తెలుస్తుంది. 24 గంటల నుంచి బాహ్య ప్రపంచానికి సంబంధం లేకుండా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఆయన పరారయినట్లు తెలుస్తుంది. పోలీసులు జానీని పట్టుకోవడానికి గాలిస్తున్నారని సమాచారం. మరోవైపు ఇప్పటికే జానీ మాస్టర్ ను జనసేన పార్టీ దూరం పెట్టింది. ఇక ఇండస్ట్రీ కూడా ఆయనపై సీరియస్ యాక్షన్ తీసుకుని ఆయనను బ్యాన్ చేసే అవకాశాలు ఉన్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా జానీ మాస్టర్ తెరమీదకు వస్తే గానీ అసలు నిజం బయటపడదు. తను మీడియా ముందుకు వస్తే మరిన్ని షాకింగ్ విషయాలు తెలిసే అవకాశం ఉంది.