రీ ఎంట్రీ తర్వాత మెగాస్టార్ చిరంజీవి క్రియేట్ చేసిన హిస్టరీ అదేనట

That is the history created by Megastar after his re entry,That is the history created by Megastar,Megastar after his re entry,history created by Megastar,Mango News,Mango News Telugu,Megastar Chiranjeevi,Bhola Shankar, Khaidi No 150, Waltheru Veeraya ,Chiranjeevi, history created by Chiranjeevi, Chiranjeevi re entry,Megastar Chiranjeevi News,Megastar Chiranjeevi Latest News,Megastar Chiranjeevi Latest Updates
Megastar Chiranjeevi,Bhola Shankar, Khaidi No. 150, Waltheru Veeraya ,Chiranjeevi, history created by Chiranjeevi, Chiranjeevi re-entry

సినీ  ఇండస్ట్రీకి ఎంతమంది హీరోలు వచ్చివెళ్లినా.. వారందరిలో మెగాస్టార్ ప్లేస్ సుస్థిరం. ఎందుకంటే ఎన్టీఆర్, ఎన్నార్ వంటి హేమాహేమీలతో పాటు..కృష్ణ,కృష్ణం రాజు, శోభన్ బాబు,  మురళీ మోహన్, చంద్రమోహన్ వంటి పెద్ద హీరోలు తమ తమ స్థానాలతో ఆడియన్స్ హృదయాలలోనూ, సినీ ఇండస్ట్రీలోనూ పాగా వేసేసిన సమయంలో..  ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చిన హీరో చిరంజీవి. స్వయంకృషితో పాటు నిత్య విద్యార్థిగా ఇప్పటికీ తనలోని నటుడిని తీర్చిదిద్దుకోవడానికి తపన పడే ఆ గుణమే అప్పటికీ..ఇప్పటికీ మెగాస్టార్‌ పేరును ప్రేక్షకుల హృదయంలో.. శాశ్వతంగా చెరగని ముద్ర వేసుకునేలా చేసింది

తనకి వచ్చిన ప్రతీ అవకాశాన్ని ఉపయోగించుకుంటూ,క్యారెక్టర్ ఆర్టిస్ట్ స్థాయి నుంచి ఇండస్ట్రీని  శాసించే స్థాయికి వెళ్లగలిగేరు. ఎన్నో హిట్స్, సూపర్ హిట్స్,బ్లాక్ బస్టర్ హిట్స్ , ఇండస్ట్రీ హిట్స్‌తో  నాలుగు దశాబ్దాలు నెంబర్ వన్ హీరోగా ఓ వెలుగు వెలిగారు. ఒక రెండు దశాబ్దాలయితే చిరుకు పోటీ ఇచ్చే హీరో టాలీవుడ్‌లోనే లేరన్న పేరును తన ఖాతాలో వేసుకున్నారు.

అయితే పొలిటికల్ ఎంట్రీతో పదేళ్ల గ్యాప్ వచ్చినా..’ఖైదీ నెంబర్ 150 ‘తో రీ ఎంట్రీ ఇచ్చి.. చిరు సృష్టించిన ప్రభంజనాన్ని చూసి ఇండస్ట్రీ మరోసారి షాక్‌కు గురయ్యింది. ఎందుకంటే అప్పటి వరకు రూ. వంద కోట్లు షేర్ మార్కుని అందుకున్న ఒకే ఒక్క సినిమా బాహుబలి మాత్రమే. ఆ మూవీ తర్వాత మళ్లీ రూ. వంద కోట్లు షేర్‌ని అందుకున్న చిత్రంగా ఖైదీ నెంబర్ 150 నిలిచింది.

ఖైదీ నెంబర్ 150  తర్వాత..సైరా నరసింహా రెడ్డి, ఆచార్య ,గాడ్ ఫాదర్, వాల్తేరు వీరయ్య,భోళా శంకర్ సినిమాు చేశారు. అయితే వీటిల్లో సైరా నరసింహ రెడ్డి , వాల్తేరు వీరయ్య సినిమాలే  బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచాయి. మిగిలిన మూడు సినిమాలు మాత్రం చిరు కెరీర్లోనే అతి పెద్ద డిజాస్టర్ ఫ్లాప్స్‌ని మిగిల్చాయి. ఎలా అయినా బాస్ ఈజ్ బాస్ అన్నట్లుగా..చిరు రీ ఎంట్రీలోనూ నయా రికార్డే సృష్టించారని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.

ఎలా అంటే చిరు రీ ఎంట్రీ తర్వాత అన్ని మూవీలను కలిపితే రూ. 567 కోట్లు షేర్ వసూళ్లు వచ్చాయి. వీటిల్లో ఖైదీ నెంబర్ 150 కి  రూ. 104 కోట్లు , సై రా నరసింహా రెడ్డికి  రూ. 143 కోట్లు, వాల్తేరు వీరయ్య మూవీకి రూ.  137 కోట్లు షేర్ వసూళ్లు వచ్చాయి.  ఈ రేంజ్ ట్రాక్ రికార్డు ఈ తరం స్టార్ హీరోలకు కూడా లేదని మరోసారి ఇండస్ట్రీ వర్గాల టాక్. 68 ఏళ్ల వయస్సులో కూడా చిరు నేటి తరం హీరోలతో తన సినిమాలతో పోటీ పడుతున్నారని అనుకుంటున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × 5 =