అల్లు అర్జున్ ‘పుష్ప 2’తో కొత్త రికార్డులు.. డిసెంబర్ 5న గ్రాండ్ రిలీజ్

Allu Arjun Sets New Records With Pushpa 2 Grand Release On December 5Th, Allu Arjun Sets New Records With Pushpa 2, Pushpa 2 Grand Release On December 5Th, Pushpa 2 Grand Release, Pushpa 2 Release On December 5Th, Pushpa 2 New Records, Allu Arjun Sets New Records, Pushpa Release, Allu Arjun, Pushpa 2, Pushpa 2 Tckets, Indian Cinema, Rashimka, Sukumar, Pushpa 2 Movie, Pushpa 2 Latest News, Allu Arjun Pushpa 2 Movie, Tollywood, Tollywood News, Tollywood Latest News, Tollywood Updates,Mango News, Mango News Telugu

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2: ది రూల్’ ఈ డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల కాబోతున్నది. ఈ చిత్రం, భారతీయ సినిమాల్లో ఇప్పటివరకు ఏ సినిమా కూడా విడుదల కానీ స్థాయిలో, ఏకకాలంలో 12,000 స్క్రీన్లలో విడుదల కానుంది. భారత్ లో సుమారు 8000 స్క్రీన్లలో, విదేశాలలో 4000 స్క్రీన్లలో ఈ సినిమా విడుదల కావడం ఖాయం. ఈ రేంజ్ లో స్క్రీన్లతో విడుదలయ్యే సినిమాను చూసే అవకాశం చాలా అరుదు

ముంబయిలో గ్రాండ్ ప్రెస్ మీట్

పుష్ప 2 చిత్ర బృందం ముంబయి నగరంలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఈ సమాచారాన్ని వెల్లడించింది. ఈ సమావేశంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్న, మైత్రీ మూవీస్ అధినేతలు రవిశంకర్, నవీన్ తదితరులు హాజరయ్యారు. పుష్ప 2 చిత్రంలోని కీలక పాత్రలుగా అల్లు అర్జున్, రష్మిక, ఫహద్ ఫాజిల్, డాలీ ధనంజయ్, తారక్ పొన్నప్ప నటిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రత్యేక సాంగ్ తో శ్రీలీల ఆకట్టుకోనున్నారు.

‘అమ్మవారి అవతారం’ పై ఆసక్తికర వ్యాఖ్యలు 

ఈ సందర్భంగా, ఒక ఫొటోషూట్ పై ప్రస్తావించిన అల్లు అర్జున్, తన ‘అమ్మవారి వేషం’ పై ఆసక్తికరంగా స్పందించారు. “పుష్ప 2 లో నా అమ్మవారి వేషం గురించి సుకుమార్ ఎప్పుడూ చెప్పినట్టు చేయాల్సింది. నాకు మొదటిసారిగా ఈ ఆలోచన ఆసక్తికరంగా అనిపించలేదు. ‘లేడీ గెటప్ ఎందుకు వేసుకుంటావు, ఆర్యూ క్రేజీ!’ అని నేను సుకుమార్ కు అన్నాను. కానీ, ఆయన నాకు అంగీకరించి, ఆ ఫొటో షూట్‌లు జరిపాం. మొదటి రెండు షూట్‌లు ఫెయిలయ్యాయి, కానీ మూడో ప్రయత్నంలో గెటప్ సక్సెస్ అయింది. ఆ సమయంలో నేను సుకుమార్ అద్భుతమైన డైరెక్టర్ అని అర్థం చేసుకున్నాను.”

“నేను ఎంత కష్టపడ్డానో మాటల్లో చెప్పలేను. ఈ వేషం చేయడానికి చాలా శ్రమించాను. ఈ కష్టాలు నా సినీ కెరీర్ లో వర్ణించలేని అనుభవం” అని అల్లు అర్జున్ తన అభిప్రాయాలను పంచుకున్నారు.

‘పుష్ప 2’ విడుదల కోసం చిత్ర బృందం భారీ సన్నాహాలు చేస్తున్నది. ఇప్పటికే, ఈ సినిమా ఏకకాలంలో 12,000 స్క్రీన్లలో విడుదలయ్యే ప్రతిపాదన అనేక రికార్డులను బద్దలు కొట్టింది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా అంచనాల పట్ల అపారమైన స్పందనను పొందింది. “పుష్ప 2” బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధిస్తుందని అభిమానులు, పరిశ్రమ ప్రొఫెషనల్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

పుష్ప 2 చిత్రం యొక్క నార్త్ ఇండియా డిస్ట్రిబ్యూటర్ అనిల్ తండానీ, ఈ సినిమాని భారీగా విడుదల చేయడం కోసం సన్నాహాలు చేస్తున్నారని చెప్పారు. “ఈ సినిమా సౌత్ నుంచి ఉత్తరాది మార్కెట్ లోకి అడుగుపెట్టిందని. పుష్ప 2 భారతీయ సినిమాకి కొత్తం మార్గం చూపుతోందని” అని ఆయన పేర్కొన్నారు.