భోళా శంకర్ ట్రైలర్‌పై కిక్కిచ్చే అప్‌డేట్.. మెగా ఫ్యాన్స్‌కు పూనకాలే

Chiranjeevis Bholaa Shankar Movie Trailer to be Released by Ram Charan Today,Chiranjeevis Bholaa Shankar Movie Trailer,Bholaa Shankar Movie Trailer to be Released,Chiranjeevis Trailer to be Released by Ram Charan Today,Bholaa Shankar Trailer to be Released by Ram Charan,Mango News,Mango News Telugu,Chiranjeevis Bholaa Shankar,Bholaa Shankar Movie Trailer,Chiranjeevi Movie,Bholaa Shankar Movie,Bholaa Shankar, Bholaa Shankar Movie Trailer Latest News,Bholaa Shankar Movie Trailer Latest Updates,Bholaa Shankar Movie Trailer Live News,Bholaa Shankar Trailer by Ram Charan,Ram Charan Latest Updates,Ram Charan Latest News,Bholaa Shankar Movie Live Updates

మెగాస్టార్ చిరంజీవి హీరోగా వస్తోన్న కొత్త సినిమా భోళా శంకర్. మెహర్ రమేష్ డైరక్షన్లో తెరకెక్కుతున్న ఈ సినిమా వర్క్స్.. శరవేగంగా సాగుతున్నాయి. ఓ వైపు స్పీడుగా షూటింగ్ వర్క్స్ జరుపుతూనే.. మరోవైపు ప్రమోషన్స్‌ను అంతే జోరుగా చేపడుతున్నారు మేకర్స్. తాజాగా మెగా అభిమానులకు కిక్కిచ్చే మాస్ అప్‌డేట్ తీసుకువచ్చారు.

ఇప్పటికే భోళా శంకర్ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్ చేయడమే కాక దానిని అనౌన్స్ కూడా చేసిన మేకర్స్.. ఇప్పుడు ఈ ట్రైలర్ రిలీజ్ కోసం చరణ్‌ని రంగంలోకి తీసుకొస్తున్నట్లు అఫీషియల్‌గా ఎనౌన్స్ చేశారు. జులై 27న సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకు గ్లోబల్ స్టార్.. చరణ్ చేతుల మీదుగా భోళా శంకర్ ట్రైలర్ లాంచింగ్ జరుగుతుందని చెప్పారు. ఈ న్యూస్ చెప్పి మెగా అభిమానుల్లో నయా జోష్ తీసుకొచ్చారు.

అంతేకాదు జులై 28న అంటే బోళాశంకర్ ట్రైలర్ రిలీజయిన ఆ మరుసటి రోజు.. పవన్ కళ్యాణ్ , సాయి ధరమ్ తేజ్ కలసి నటించిన బ్రో సినిమా రిలీజ్ కాబోతోంది. దీంతో మెగాభిమానులకు ఇది డబుల్ కాదు ట్రిపుల్ కిక్ ఇచ్చే న్యూస్ అవుతుందనే చెప్పుకోవచ్చు.అందుకే ఈ అప్ డేట్ తెలిసిన మెగా ఫ్యాన్స్.. పూనకాలతో ఊగిపోతున్నారు. ఇది కదా మెగా ట్రీట్ అంటూ మురిసిపోతున్నారు.

ఇక భోళా శంకర్ సినిమాలో మెగాస్టార్‌కు జోడిగా మిల్కీ బ్యూటీ తమన్నా నటిస్తుండగా.. చిరంజీవి చెల్లెలి పాత్రలో సహజనటి కీర్తి సురేశ్ కనిపించనుంది.ఈ సినిమాలో అక్కినేని వారి హీరో సుశాంత్ కూడా నటిస్తున్నాడు. తమిళంలో సూపర్ హిట్ అయిన మూవీ ‘వేదాళం’ సినిమాకి రీమేక్ గా.. బోళాశంకర్ సినిమా రూపొందుతోంది. మెహర్ రమేశ్ డైరక్షన్లో తెరకెక్కుతున్న బోళాశంకర్‌ను.. ఎ.కె.ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. మహతి స్వర సాగర్ బాణీలు కడుతున్న భోళా శంకర్‌ను..ఆగస్టు 11న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయబోతున్నారు.

ఇప్పటికే భోళా శంకర్ నుంచి రిలీజయిన చిరంజీవి టాక్సీ డ్రైవర్ లుక్కు ఫ్యాన్స్‌లో కిక్కును పుట్టించగా.. మిల్కీ బ్యూటీ సాంగ్ బాగా వైరల్ అయింది. సిస్టర్ సెంటిమెంట్‌తో రాబోతున్న చిరు సినిమాపై మెగా ఫ్యాన్స్ భారీ అంచనాలే పెట్టుకున్నారు. దీనికి తోడు మేకర్స్ నుంచి ఎప్పటికప్పుడు బయటకొస్తున్న క్రేజీ అప్ డేట్స్.. మెగాభిమానుల అంచనాలకు పీక్స్‌కు తీసుకెళ్లిపోతున్నాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

6 + 3 =