ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారాల పట్టి అల్లు అర్హ ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రశంసలు అందుకుంటోంది. తాజాగా, ‘అన్‌స్టాపబుల్’ షో సీజన్ 4లో అతిధిగా పాల్గొన్న అర్హ, తన ముద్దు మాటలతో నెటిజన్లను ఆకట్టుకుంది. ఈ షోలో, బాలకృష్ణ అల్లు అర్జున్ కూతురు అర్హతో సరదాగా ముచ్చటించారు. అయితే, కష్టమైన తెలుగు పద్యాన్ని ఇంత సులభంగా చెప్పి అందరికీ షాక్ ఇచ్చింది!
అల్లు అర్జున్ కుటుంబం ‘అన్‌స్టాపబుల్’ షోలో పాల్గొన్నప్పటి నుండి, అర్హకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఒక సందర్భంలో, బాలకృష్ణ సరదాగా అర్హను అడిగాడు, “తెలుగు వచ్చా?” అప్పుడు అల్లు అర్జున్ కూడా “తెలుగు వచ్చా?” అని పలుకుతుండగా, దీనికి అల్లు అర్జున్ స్పందిస్తూ.. తెలుగు రావటమా.. అంటూ తన కూతురు చెవిలో పద్యం పాడు అంటాడు.
దీంతో అర్హ అల్లసాని పెద్దన్న రచించిన మను చరిత్రలోని ”అటజని కాంచె భూమిసురు డంబర చుంబి శిరస్సరజ్ఝరీ పటల ముహుర్ముహుర్ లుఠ దభంగ తరంగ మృదంగ నిస్వన. స్ఫుట నటనానుకూల పరిఫుల్ల కలాప కలాపి జాలమున్. గటక చరత్కరేణు కర కంపిత సాలము శీతశైలమున్.” అంటూ ఫుల్ పద్యం చదివేస్తుంది. దీంతో ఒక్కసారిగా షాక్ తింటాడు బాలయ్య. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
ఈ అద్భుతమైన పద్యం చెప్తున్న అర్హను చూసి, బాలకృష్ణ ఆశ్చర్యపోయారు. పద్యం ముగిసే సరికి, బాలయ్య ఆమెను ముద్దాడి, “తెలుగు చల్లగా… నాలుగు కాలాల పాటు హాయిగా ఈ భూమ్మీద బతుకుతుంది అనిపిస్తుంది” అంటూ ప్రశంసలు కురిపించారు. బాలకృష్ణ, అల్లు అర్జున్ కుటుంబం గురించి మరిన్ని సరదా ప్రశ్నలు అడిగారు. అల్లు అర్జున్ తన పిల్లల గురించి, అర్హ ప్రత్యేకంగా తన చిన్నాభిన్న అల్లరిని, అయాన్ గురించి చెప్పింది. ఆ సమయంలో, బాలకృష్ణ అల్లు అర్జున్ మరియు అతని కుటుంబాన్ని ప్రశంసించారు.