హైదరాబాద్‌లో మూవీ లవర్స్‌కు బ్యాడ్ న్యూస్ వినిపిస్తున్నారు థియేటర్ యాజమాన్యం. ఎల్లుండి నుంచి అంటే మే 17 నుంచి హైదరాబాద్ సిటీతో పాటు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న కొన్ని సింగిల్ స్క్రీన్ సినిమా హాళ్లను కొద్ది రోజులు మూసివేయనున్నట్లు థియేటర్స్ యాజమాన్యం ప్రకటించింది.
సాధారణంగా సమ్మర్ వస్తుందంటేనే కొత్త సినిమాలు సందడి చేస్తుంటాయి. కేవలం వేసవికాలంలో రిలీజ్ చేయడానికి డేట్స్ కూడా ఫిక్స్ చేసి పెట్టుకుంటారు. కానీ ఈ ఏడాది ఎందుకో వేసవిలో కొత్త సినిమాలు ఏవీ కూడా రిలీజ్ కాలేదు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఎన్నికల హడావుడి ఉండటంతో.. కొత్త సినిమాల విడుదలను నిర్మాతలు వాయిదా వేసుకున్నారు.
అంతేకాకుండా ఈ సారి సమ్మర్ టార్గెట్ గా పెద్ద సినిమాలతో పాటు చిన్నా చితక చిత్రాలు కూడా ఏవీ సిద్ధం అవలేదు. దీంతో సింగిల్ ధియేటర్లలో సినిమాలు పడే అవకాశం లేదు.ఇప్పటికే కొన్ని సినిమాలను రీ రిలీజ్ చేసుకుంటూ థియేటర్లను నడిస్తున్నారు వాటి యజమానులు.
చిన్న సినిమాలకు ప్రేక్షకుల నుంచి ఆదరణ లభించకపోవడంతో..థియేటర్ కరెంట్ ఛార్జీలు, మెయింటెనెన్స్ ఖర్చులు కూడా రావడం లేదు. దీంతో భారీగా నష్టపోతున్నారు. దీనికి తోడు మే నెలాఖరు వరకు కూడా కొత్త సినిమాలు విడుదల లేకపోవటంతో.. ధియేటర్లను 10 రోజులకు పైగా మూసివేయాలని నిర్ణయం తీసుకున్నారు.
నిజానికి మల్టీప్లెక్స్‌లు వచ్చాక చిన్న థియేటర్లకు వచ్చేవారి సంఖ్య బాగా తగ్గిపోయింది. దీనికి తోడు షాపింగ్స్ చేసో.. ఫ్యామిలీతో బయటకు వెళ్లో అలా థియేటర్‌కు వెళ్లే వారి సంఖ్య కూడా ఎక్కువే. కానీ చిన్న థియేటర్ల వైపు వెళ్లాలంటే ప్రత్యేకించి వెళ్లాల్సి రావడంతో చాలామంది అటు వెళ్లడం తగ్గించారు. దీనికితోడు మల్టీఫ్లెక్స్‌లలో తెలుగుతోపాటు హిందీ, ఇంగ్లీష్, హాలీవుడ్ సినిమాలు కూడా వేయడంతో వారికి బాగానే లాభాలు వస్తున్నాయి కాబట్టి వాటిని ఒక్క రోజు కూడా క్లోజ్ చేయకుండా రన్ చేస్తున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY