బిగ్‌బాస్ సీజన్ 4 తెలుగు : సెప్టెంబరు 6 న ప్రారంభం

Bigg Boss, Bigg Boss Season 4, bigg boss season 4 contestants, bigg boss season 4 contestants list, bigg boss season 4 contestants list telugu, bigg boss season 4 in telugu, Bigg Boss Season 4 Telugu, bigg boss season 4 telugu contestants, Bigg Boss Season 4 Telugu to Start on September 6th, Bigg Boss Telugu Season 4

తెలుగు టీవీ ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తూ వస్తున్నా బిగ్‌బాస్ రియాలిటీ షో నాలుగో సీజన్ త్వరలో ప్రారంభం కానుంది. బిగ్‌బాస్ సీజన్ 4 తెలుగు సెప్టెంబర్ 6, ఆదివారం నాడు ప్రారంభమవుతుందని నిర్వాహకులు తాజాగా వెల్లడించారు. ఈ సీజన్ కి కూడా అగ్ర కథానాయకుడు, కింగ్ అక్కినేని నాగార్జున హోస్ట్ గా వ్యవరించనున్నారు. గత మూడు సీజన్లు విశేష జనాదరణ పొందడంతో, ఇటు బుల్లితెర ప్రేక్షకులు, బిగ్‌బాస్ కార్యక్రమం అభిమానులు, మరి ముఖ్యంగా నాగార్జున హోస్ట్ అవ్వడంతో సినీ అభిమానులు సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బిగ్‌బాస్ మొదటి సీజన్లో శివబాలాజీ, రెండో సీజన్లో కౌశల్, మూడో సీజన్లో సింగర్ రాహుల్ సిప్లిగంజ్ విజేతలుగా నిలిచారు. మూడు సీజన్స్ లో బిగ్‌బాస్ లో పాల్గొన్న సభ్యులు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోగా, నాలుగో సీజన్ తో కూడా సరికొత్త ఎంటర్టైన్మెంట్ అందించనున్నట్టు చెబుతున్నారు.

ప్రస్తుత కరోనా నేపథ్యంలో ఈ సీజన్‌లో పాల్గొనే సభ్యులకు ముందుగానే పరీక్షలు నిర్వహించి, క్వారంటైన్‌ లో ఉంచినట్టు తెలుస్తుంది. పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నవారినే బిగ్‌బాస్‌ హౌస్‌లోకి పంపించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. బిగ్‌బాస్ సీజన్ 4 తెలుగు లో పాల్గొనే సభ్యులపై ఇంతవరకు అధికారికంగా ఎటువంటి ప్రకటన రాలేదు. అయితే బిగ్‌బాస్ లో పాల్గొనేది వీళ్ళేనంటూ పలువురు పేర్లు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. డాన్స్ మాస్టర్ రఘు మాస్టర్‌, ఆయన భార్య ప్రణవి, నోయల్‌, జబర్దస్త్‌ అవినాష్‌, డాన్స్ మాస్టర్ అమ్మ రాజశేఖర్, గంగవ్వ, మెహబూబ్‌ దిల్‌సే,‌ అరియానా గ్లోరీ, సోహైల్‌ రియాన్‌, కరాటే కల్యాణి సహా పలువురి పేర్లు వినిపిస్తున్నాయి. అయితే వీళ్లు గాని, నిర్వాహకులు గాని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. మరో వారంలో మొదలయ్యే బిగ్‌బాస్ 4 తెలుగు, ఎన్ని సంచలనాలు సృష్టిస్తుందో వేచి చూడాలి.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu