54 ఏళ్ల బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్‌పై గురువారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో బాంద్రాలోని ఆయన ఇంట్లో దొంగతనం జరిగింది. ఈ ఘటనలో సైఫ్‌కు 10 సెం.మీ మెడ గాయం, వెన్నెముకపై లోతైన కత్తి గాయాలు తగిలాయి. ప్రస్తుతం ఆయన లీలావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
సైఫ్ ఇంట్లో పని చేసే వ్యక్తిని దొంగ ముందుగా ఎదుర్కొని ఆమెపై దాడి చేశాడు. సైఫ్ జోక్యం చేసుకోవడానికి ప్రయత్నించగా, దొంగ ఉన్మాదంగా ప్రవర్తించి సైఫ్‌పై పదునైన ఆయుధంతో దాడి చేశాడు. ఈ సంఘటనలో సైఫ్ తీవ్ర గాయాలతో ఆసుపత్రికి తరలించబడ్డారు.
లీలావతి ఆసుపత్రి వైద్యులు
సైఫ్‌కు ఆరు చోట్ల కత్తి గాయాలు తగిలాయని, వాటిలో రెండు గాయాలు లోతైనవిగా ఉన్నాయని లీలావతి ఆసుపత్రి COO నిరాజ్ ఉత్తమణి తెలిపారు. ఆయన వెన్నెముకకు ప్రమాదకరంగా దగ్గరగా గాయం తగిలిందని న్యూరోసర్జన్ డాక్టర్ నితిన్ దాంగే, కాస్మెటిక్ సర్జన్ డాక్టర్ లీనా జైన్ పర్యవేక్షిస్తున్నారు.
సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో జరిగిన ఈ ఘటనపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ జోన్ 9, దీక్షిత్ గేదం మాట్లాడుతూ, “ఒక్క దొంగే ఈ దాడి చేశాడని ప్రాథమికంగా తేలింది. ఇంట్లో పనిమనిషి ఆరోగ్యం నిలకడగా ఉంది” అని పేర్కొన్నారు.
సెలెబ్రిటీల స్పందన
ఈ ఘటనపై ఎన్టీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. “సైఫ్ అలీ ఖాన్‌పై దాడి వార్త విని షాక్‌కు గురయ్యాను. ఆయన త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను” అని ట్వీట్ చేశారు. చిరంజీవి కూడా స్పందిస్తూ, “ఈ వార్త వినడం ఎంతో బాధాకరం. సైఫ్ త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాను” అని ట్వీట్ చేశారు.
దేవర సినిమాతో గుర్తింపు
సైఫ్ అలీ ఖాన్, ఎన్టీఆర్ కలిసి నటించిన “దేవర” చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి స్పందన తెచ్చుకుంది. ఈ సినిమాలో సైఫ్ భైరా పాత్రలో నటించి ప్రశంసలు పొందారు. దేవర ప్రపంచవ్యాప్తంగా రూ.500 కోట్లకు పైగా వసూలు చేసింది. దీనికి సీక్వెల్‌ని దర్శకుడు కొరటాల శివ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.
సైఫ్ ఆరోగ్యం మెరుగుపడాలని అభిమానులు, బాలీవుడ్ తారలు ప్రార్థిస్తున్నారు.
Shocked and saddened to hear about the attack on Saif sir.
Wishing and praying for his speedy recovery and good health.
— Jr NTR (@tarak9999) January 16, 2025
Deeply Disturbed by news of the attack by an intruder on #SaifAliKhan
Wishing and praying for his speedy recovery.
— Chiranjeevi Konidela (@KChiruTweets) January 16, 2025