ఎన్టీఆర్-కొరటాల కాంబోలో వచ్చిన యాక్షన్ థ్రిల్లర్ ‘దేవర’ బాక్సాపిస్ వద్ద మంచి కలెక్షన్స్ సాధించింది. తొలిరోజు డివైట్ టాక్ వచ్చినప్పటికీ, ఆ తర్వాత సూపర్ హిట్ దిశగా ‘దేవర’ దూసుకుపోయింది. సినిమా రిలీజై 20 రోజులు దగ్గరికి వస్తున్న.. ఇంకా దేవర క్రేజ్ ఎక్కడా తగ్గడం లేదు. కేవలం వీకెండ్‌లో మాత్రమే కాదు.. వీక్ డేస్‌లోనూ ఈ సినిమా దుమ్మురేపుతుంది. కేవలం రెండు వారాల్లోనే… ఈ సినిమా రూ.405 కోట్లు కొల్లగొట్టింది.కాగా.. ఆ తర్వాత కాస్త స్లో రన్ అవగా.. రీసెంట్‌గా ఈ మూవీ రూ.500 కోట్ల క్లబ్‌లో అడుగుపెట్టింది. మిక్స్డ్ టాక్‌తో ఈ రేంజ్‌లో కలెక్షన్లు కొల్లగొట్టడం అంటే మాములు విషయం కాదు.
ఇక ఇప్పటికే పలు రికార్డులు తన ఖాతాలో వేసుకున్న దేవర సినిమా ఇప్పుడు మరో రికార్డ్ సాధించింది. దీంతో మరోసారి ఈ సినిమా పేరు ఎక్స్‌లో ట్రెండింగ్‌లోకి వచ్చింది. ‘దేవర’ రిలీజై 18 రోజులు పూర్తవగా.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణాల్లో రోజూ కోటి రూపాయలు వసూలుచేసినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. కొవిడ్ తర్వాత ఈ స్థాయిలో కలెక్షన్లు రాబట్టిన సినిమా ‘దేవర’ కావడం గమనార్హం. అలాగే సీడెడ్ ఏరియాలోనూ రూ.30 కోట్ల షేర్ వసూలు చేసినట్లు తెలుస్తోంది.
ఎన్టీఆర్ సరసన జాన్వీ నటించిన ఈ సినిమా సీక్వెల్ వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు. మొదటిభాగం కంటే రెండోభాగం చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుందని దర్శకుడు ఇటీవల చెప్పారు. పార్ట్-1లో చూసింది 10 శాతమేనని.. రెండో భాగంలో 100శాతం చూస్తారన్నారు. ఇక ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా ఓటీటీ డేట్ లాక్ చేసుకున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమా డిజిటల్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సంస్థ దక్కించుకుంది. కాగా… నవంబర్ 10 నుంచి ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు తెలుస్తుంది.