గేమ్ షూరు చేసిన రామ్ చరణ్‌

Ram Charan Game Changer Movie Latest Update

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన ‘గేమ్ ఛేంజర్’ చిత్రం కోసం మెగా ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. మూమీ మేకర్స్ ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు కాని ఇప్పటికి ప్రమోషన్ చేయడం లేదు. దీంతో అభిమానులు ఆ విషయంలో కొద్దిగా డిస్సప్పాయింట్ అయ్యారనే చెప్పాలి. కానీ తాజాగా చెన్నైలో జరిగిన గేమ్ ఛేంజర్ ప్రెస్ మీట్ లో దిల్ రాజు మాట్లాడుతూ.. ఈ నెల 9న లక్నోలో ‘గేమ్ ఛేంజర్’ మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్ ఉంటుందని వెల్లడించారు. ఆ తర్వాత యూఎస్, చెన్నైలో స్పెషల్ ఈవెంట్లు, 2025 జనవరి మొదటి వారంలో తెలుగు రాష్ట్రాల్లో ఈవెంట్ కు ప్లాన్ చేస్తున్నట్టు దిల్ రాజు చెప్పుకొచ్చారు. దీంతో మెగాఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారట.

ఈ క్రమంలో గేమ్ ఛేంజర్ టీజర్ లాంచ్ ఈవెంట్ చెన్నైలో నిర్వహిస్తారని తెలుస్తుంది. ఈ ఈవెంట్ కు శంకర్, దిల్ రాజు తో పాటు రామ చరణ్, పలువురు నటీనటులు హాజరవుతారని సమాచారం. చెన్నై నుంచి మొదలు పెట్టి ఆ తర్వాత పాన్ ఇండియా ప్రమోషన్స్ చేస్తారేమో. ఇక చరణ్ బయటకు వచ్చి సినిమా గురించి మాట్లాడతాడని గేమ్ ఛేంజర్ టీజర్ లాంచ్ ఈవెంట్ కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.

డల్లాస్ లో గేమ్ ఛేంజర్ కు భారీ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. దీనికి చరణ్ తో పాటు మూవీ యూనిట్ కూడా హాజరు కానున్నారు. సినిమా రిలీజ్ కి ముందే అమెరికాలో ఇక్కడ తెలుగులో చేసినట్టు ప్రమోషన్స్ చేస్తుండటంతో చరణ్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇలా చేస్తున్న మొదటి సినిమా గేమ్ ఛేంజర్ కావడం గమనార్హం. మొత్తానికి గేమ్ ఛేంజర్ ప్రమోషన్స్ ని దిల్ రాజు ఇంటర్నేషనల్ లెవల్ లో ప్లాన్ చేస్తున్నారుగా. ఇక గేమ్ ఛేంజర్ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 10న రిలీజ్ కానుంది.

సినిమా గురించి దిల్ రాజు మాట్లాడుతూ “21 ఏళ్ల నా సినీ ప్రయాణంలో ‘గేమ్ ఛేంజర్’ మూవీ 50వ సినిమా. మూడేళ్ల క్రితం డైరెక్టర్ శంకర్ ఈ సినిమా కాన్సెప్ట్ చెప్పినప్పుడు ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. నా స్నేహితుడు – నిర్మాత ఆదిత్య రామ్ తెలుగులో నాలుగు సినిమాలను ప్రొడ్యూస్ చేశారు. వ్యాపారం నిమిత్తం చెన్నైలో బిజీ అయిన ఆయన ‘గేమ్ ఛేంజర్’ సినిమాలో భాగం కావాలని అడగగానే ఓకే చెప్పారు అని తెలిపారు.