సాయిధరమ్‌ తేజ్‌ ఆరోగ్య పరిస్థితిపై తాజా హెల్త్ బులెటిన్ విడుదల

Apollo Hospital Releases Health Bulletin on Actor Sai Dharam Tej, Apollo Hospital Releases Health Bulletin on Actor Sai Dharam Tej Health Condition, Chiranjeevi’s nephew actor Sai Dharam Tej injured, Health Bulletin on Actor Sai Dharam Tej Health Condition, Hyderabad, Mango News, Sai Dharam Tej Accident, Sai Dharam Tej Accident News, Sai Dharam Tej Bike Accident, Sai Dharam Tej Health Condition, Sai Dharam Tej injured in a road accident, Sai Dharam Tej Meets With a Road Accident, Tollywood Actor Sai Dharam Tej Injured in Bike Accident

ప్రముఖ నటుడు సాయిధరమ్‌ తేజ్‌ రోడ్డు ప్రమాదానికి గురై, ప్రస్తుతం జూబ్లీహిల్స్ లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సాయిధరమ్‌ తేజ్‌ ఆరోగ్య పరిస్థితిపై అపోలో ఆసుపత్రి వైద్యులు తాజా హెల్త్ బులెటిన్ ను విడుదల చేశారు. “సాయిధరమ్ తేజ్‌ ఆరోగ్యం నిలకడగా ఉంది. ఎలాంటి ఇంటర్నల్ బ్లీడింగ్ కనుగొనబడలేదు. డాక్టర్ అలోక్ రంజన్ మరియు బృందం నేతృత్వంలో కొనసాగుతున్న చికిత్సకు ఆయన బాగా స్పందిస్తున్నారు. కాలర్ బోన్ గాయానికి సంబంధించిన సర్జరీ విషయాన్ని తర్వాత 24 గంటల్లో పరిశీలిస్తాం” అని బులెటిన్ లో పేర్కొన్నారు. మరోవైపు ఉదయం నుంచి పలువురు తెలుగు సినీరంగ ప్రముఖులు అపోలో ఆసుపత్రికి చేరుకొని, సాయిధరమ్‌ తేజ్‌ ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకుంటున్నారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen − three =