పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంతా తమ హీరో ఏపీలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాదించడంతో పాటు ప్రస్తుత కేబినెట్లో మంత్రిగా, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో ఫుల్ జోష్ లో ఉన్నారు. అయితే పవర్ స్టార్ పెండింగ్ ఉంచిన ప్రాజెక్టులలో పవన్ ను సరికొత్తగా సిల్వర్ స్క్రీన్ ఫై చూడాలని ఆయన ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. పవన్ కళ్యాణ్ పొలిటికల్ గా బిజీగా ఉండడంతో పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమాల సంగతి అయోమయంలో ఉన్నాయి.అసలు పవన్ సినిమాల్లో నటిస్తారా లేదా అన్న డైలమా అందరిలోనూ వచ్చేసింది.
ఇలాంటి సమయంలోనే పవన్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ రాబోతున్నట్టు తెలుస్తోంది. ఇటీవల ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను నిర్మాత డీవీవీ దానయ్య కలిసారట. పవన్ తో OG చిత్రాన్ని నిర్మాత దానయ్య నిర్మిస్తుండగా..అది దాదాపు 70% షూటింగ్ పూర్తి చేసుకుంది.అది కూడా పవన్ కళ్యాణ్ కు సంబంధించిన రోల్ కోసం కేవలం పది లేదా పదిహేను రోజుల షూటింగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉందని టాక్ వినిపిస్తోంది.
అయితే దానయ్య వెళ్లి కలవడంతో.. OG సినిమా అతి త్వరలో కచ్చితంగా పూర్తి చేస్తానని హామీ ఇచ్చారట పవన్ కళ్యాణ్. ఈ మాటతో రిలాక్స్ అయిన డీవీవీ దానయ్య.. పవన్ కళ్యాణ్ సెట్స్ కు ఇలా వస్తే అలా ఆ సినిమాలోని కీలక సన్నివేశాలను చక చక పూర్తి చేయడానికి దర్శకుడు సుజిత్ తో ఏర్పాట్లు చేయిస్తున్నారని టాక్ వినిపిస్తుంది. దీంతో త్వరలోనే OG సెట్స్ లో పవన్ కళ్యాణ్ పాల్గొననున్నారని తెలుస్తోండటంతో పవన్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన టీజర్ తో ఫ్యాన్స్ అంచనాలు తారా స్థాయికి చేరాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE