గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్లో రానున్న ‘గేమ్ చేంజర్’ మూవీ జనవరి 10 వ తారీఖున వరల్డ్ వైడ్‌గా తెలుగు, హిందీ,తమిళ భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ అవబోతోంది. ఇప్పటికే ఈ మూవీ టీజర్, సాంగ్స్ కి ఫ్యాన్స్, ఆడియన్స్ నుంచి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. ఈ నెల 21వ తారీఖు నుంచి మూవీ టీమ్ ప్రమోషన్స్ భారీ రేంజ్లో ప్రారంభించడానికి రెడీ అయింది.
దేశంలోనే మొట్టమొదటిసారిగా అమెరికాలోని డల్లాస్‌లో డిసెంబర్ 21న ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను జరుపుకోబోతున్న మొట్టమొదటి ఇండియన్ మూవీగా ‘గేమ్ చేంజర్’ సరికొత్త రికార్డ్ సృష్టించబోతోంది. ఆ తర్వాత ఇండియాలో అన్ని రాష్ట్రాల్లోనూ ప్రీ రిలీజ్ ఈవెంట్స్‌ను గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. అయితే ఈ సినిమాకి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ఓవర్సీస్‌లో ఈమధ్యే ప్రారంభమైంది.
మూడు రోజుల క్రితం నార్త్ అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్స్ మొదలు పెట్టగా, వెయ్యి షోస్ నుంచి 2 లక్షల 50 వేల డాలర్స్ గ్రాస్ వసూళ్లు వచ్చినట్టు తెలుస్తోంది. ఇప్పుడు కల్కి, సలార్, దేవర, పుష్ప 2 రేంజ్ లోనే అడ్వాన్స్ బుకింగ్స్ జరుగుతున్నా.. ఇదే రేంజ్ ఊపుని కొనసాగిస్తే మాత్రం కచ్చితంగా ఈ చిత్రం నార్త్ అమెరికాలో ప్రీమియర్ షోస్ నుంచి 3 మిలియన్ డాలర్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబడుతుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.
నిన్నటి నుంచి తెలుగు వాళ్లు ఎక్కువగా ఉండే నార్త్ అమెరికా రాష్ట్రాల్లో గేమ్ ఛేంజర్ XD షోస్ ని షెడ్యూల్ చేస్తూ వెళ్తున్నారు మేకర్స్. ఎందుకంటే XD షోస్ కి అక్కడ ఉండే మన ఆడియన్స్ ఎక్కువగా ఆసక్తి చూపించడంతో.. ఆ షోస్ నుంచే ఈ సినిమాకి అద్భుతమైన రెస్పాన్స్ వస్తుందని అంటున్నారు.
ఈ మూవీ ఆల్ టైం రికార్డు ప్రీమియర్స్ ని రాబట్టాలంటే..నార్త్ అమెరికా నుంచి నాలుగు మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లను రాబట్టాల్సి వస్తుంది. కల్కి చిత్రానికి ప్రీమియర్ షోస్ నుంచి 3.9 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. అయితే ప్రస్తుతానికి అయితే గేమ్ ఛేంజర్‌కు ఓవర్సీస్ లోని అన్ని దేశాలకు కలిపి 3 లక్షల 50 వేల డాలర్లు వచ్చాయని.. డిసెంబర్ 21న రామ్ చరణ్ నార్త్ అమెరికా లో ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొని వెళ్లిన తర్వాత గ్రాస్ వసూళ్లు పెరిగే అవకాశాలుంటాయని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.