ఎపిసోడ్ 18( ఆగస్టు 7) హైలైట్స్: అలీరేజా- హిమజ మధ్య పెద్ద గొడవ, రవికృష్ణకు గాయం

Akkineni Nagarjuna, Baba Master, Bigg Boss, Bigg Boss Episode 18, Bigg Boss Episode 18 Bigg Boss Season 3 Telugu, Bigg Boss Season 3 Telugu Episode 18 Highlights, Bigg Boss Telugu, Bigg Boss Telugu 3, Bigg Boss Telugu 3 Highlights, Bigg Boss Telugu 3 Latest, Hema, Highlights Of Bigg Boss Telugu 3, Highlights Of Bigg Boss Telugu 3 Episode 16, himaja, Jaffar, Jaffar Elmination, Mango News Telugu, Nomination Tasks, punarnavi, Rahul, Ravi, Rohini, Sreemukhi, Tammanah Simhadri, Varun Sandesh, Vithika

గత రెండు సీజన్లుగా తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న, బిగ్ బాస్ తెలుగు 3వ సీజన్ జూలై 21 నాడు ప్రారంభమైంది. ఈ సీజన్ కి వ్యాఖ్యాతగా కింగ్ అక్కినేని నాగార్జున వ్యవరిస్తున్నారు. 100 రోజుల పాటు ఆసక్తికరంగా సాగే ఈ షో లో 15 మంది సభ్యులు బిగ్ బాస్ ఇంటిలోకి ఎంటరయ్యారు. మొదటగా నటి హేమ ఎలిమినేట్ అవ్వగా వైల్డ్ కార్డు ఎంట్రీగా తమన్నా సింహాద్రి ఇంటిలోకి వచ్చింది, తరువాత జర్నలిస్ట్ జాఫర్ ఎలిమినేట్ అయ్యారు. జాఫర్ ఎలిమినేషన్ తో ఇంటిలో 14 మంది సభ్యులున్నారు. ఆగస్టు 7న ప్రసారమైన బిగ్ బాస్-3 పద్దెనిమిదవ ఎపిసోడ్ లో టాస్క్ లో ఇంటి సభ్యులు వింత చేష్టలకు దిగారు. అలీరేజా- హిమజ మధ్య పెద్ద గొడవ జరిగింది. శ్రీముఖి ప్లాన్ తో రవికృష్ణ గాయపడ్డాడు. ఈ ఎపిసోడ్ లో సభ్యులు వ్యక్తిగత దూషణకు దిగారు.

ఎపిసోడ్ 18( ఆగస్టు 7) హైలైట్స్: అలీరేజా- హిమజ మధ్య పెద్ద గొడవ, రవికృష్ణకు గాయం

 • బిగ్ బాస్ ఇంటి సభ్యులకు దొంగలున్నారు జాగ్రత్త అనే కెప్టెన్సీ టాస్క్ ఇచ్చారు
 • ఊరు పెద్దలుగా వరుణ్-తమన్నా, జంటగా అలీ-పునర్నవి మరియు అన్నాదమ్ములుగా రాహుల్- మహేష్, అక్క చెల్లెలుగా రోహిణి-వితికా, బద్దకపు పోలీసుగా బాబాబాస్కర్, స్ట్రిక్ట్ పోలీసుగా శివజ్యోతి, లాయర్ గా హిమజ, రవి-శ్రీముఖి- అషు రెడ్డిలను దొంగలుగా ప్రకటించి టాస్క్ చేయమని బిగ్ బాస్ కోరాడు
 • ఎపిసోడ్ ప్రారంభంలోనే దొంగతనం చేస్తున్నాడని రవికృష్ణను బాబాబాస్కర్,శివజ్యోతి ఇంటిలో ఉన్న జైలులో వేశారు
 • తమన్నా సింహాద్రి, దొంగలుగా వ్యవహరిస్తున్న శ్రీముఖి టీం తో కలిసిపోయిందని పోలీసులుగా ఉన్న బాబాబాస్కర్,శివజ్యోతి లకు వరుణ్ సందేశ్ చెప్పి గమనించమంటాడు
 • ఈ టాస్క్ లో భాగంగా తనను పట్టుకోవద్దని శ్రీముఖి ఇంటి సభ్యులతో చెప్పింది
 • వరుణ్ సందేశ్ ని మాటల్లో పెట్టి శ్రీముఖి అతని జేబులో ఉన్న డబ్బులు తీసుకుంది
 • జరుగుతున్న కెప్టెన్సీ టాస్క్ లో అలీరేజా- హిమజ మధ్య పెద్ద గొడవ జరిగింది
 • ఇంట్లో వాటర్ త్రాగడానికి వెళ్లిన హిమజను, అలీ డబ్బులు డిమాండ్ చేయడంతో ఆమె నిరాకరించింది
 • రెండోసారి నీళ్లు తాగడానికి వెళ్లే సమయంలో హిమజను అడ్డుకుని, ఆమెను తాకారని చోట చేతితో డబ్బులు తీసుకునే ప్రయత్నం చేయడంతో, అటువంటి పరిస్థితుల్లో ముందు ఆలోచన లేకుండా అలీరేజా ముఖంపై హిమజ తన్నేసింది
 • కావాలంటే డబ్బులు ఇస్తా కానీ, నన్ను టచ్ చేయకు అని హిమజ అలీ పై అరవగా, అలీ కూడ తీవ్రంగా ప్రతిస్పందించాడు
 • అలీ వ్యక్తిగత దూషణకు దిగడంతో హార్ట్ అయిన హిమజ, కావాలని తన్న లేదు జరిగింది కాబట్టి క్షమించమని కోరింది. అయినా అలీ తగ్గకపోవడంతో కాళ్లపై పడి క్షమాపణ కోరింది.
 • రోహిణి, రాహుల్ మిగతా ఇంటి సభ్యులు కూడ అలీని సపోర్ట్ చేయడంతో హిమజ బాత్రూంలో ఏడ్చేసింది
 • ఇదే విషయంపై అలీ-తమన్నా సింహాద్రి కూడ వాదించుకున్నారు
 • తరువాత హిమజ వచ్చి అలీకి జరిగింది వివరించడంతో వారిద్దరి మధ్య గొడవ సద్దుమణిగింది
 • శ్రీముఖి డంబెల్ తో నిధి ఉన్న డబ్బా అద్దాలను ను పగల కొట్టింది, రవికృష్ణ కూడ అద్దాలు పగలగొట్టడంతో అతని చేతికి గాయం అయింది
 • మరో వైపు శ్రీముఖి వల్లే రవికృష్ణకి గాయం అయిందని వితికా, రాహుల్ శ్రీముఖి పై విరుచుకుపడ్డారు
 • ఈ కెప్టెన్సీ టాస్క్ మొత్తం పర్సనల్ వ్యాఖ్యలు, గొడవలతో సాగింది
 • నిధిని ఎవరు సొంతం చేసుకుంటారు, ఎవరు తరువాత కెప్టెన్ అవుతారు అనే ఆసక్తికర అంశాలతో ఈరోజు ఎపిసోడ్ సాగనుంది 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here