తమన్ పరిస్థితి ఇలా ఎందుకు తయారయింది? ఓవర్ లోడ్‌ వల్లే టెన్షన్ పడుతున్నాడా?

Tollywood Music Director SS Thaman Stressed Due To Overload,Tollywood Music Director SS Thaman,SS Thaman Stressed Due To Overload,Music Director SS Thaman Stressed,Mango News,Mango News Telugu,Thaman,stressed, overload,Music Director Thaman Shares The Reason,S Thamans physical transformation,Music Director SS Thaman Overload,Stressed Due To Overload,Tollywood Music Director SS Thaman News Today,Music Director SS Thaman Latest News,Music Director SS Thaman Latest Updates,Music Director SS Thaman Live News,SS Thaman Due To Overload News Updates

టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో తమన్ కూడా ఒకరు. దాదాపు 15 ఏళ్లుగా టాలీవుడ్‌లో సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్‌గా చేస్తూ వస్తున్నారు. అల్లు అర్జున్‌తో చేసిన అల వైకుంఠపురములో అనే సినిమాతో తమన్‌కు దేశవ్యాప్తంగా క్రేజ్ తన్నుకు వచ్చింది. అయితే ఈ మధ్య కాలంలో తమన్ తీసుకుంటున్న నిర్ణయాలే ఆయనకు చెడ్డ పేరు తెస్తున్నాయనే టాక్ వస్తోంది. తమన్ తన కెరీర్‌లో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలకు సంగీతం అందించారు. ఆయన సినిమాల్లో చాలా పాటలు ఆల్ టైమ్ ఫేవరేట్‌‌గా నిలిచాయి.

కానీ ఏమయిందో కానీ కొన్ని సినిమాల నుంచి తమన్‌పై ట్రోలింగ్ ఓ రేంజ్‌లో పెరిగిపోతుంది. దీనికి ఓ రీజన్ కూడా ఉందని ఇండస్ట్రీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. తమన్ ఒకేసారి ఎక్కువ సినిమాలను ఒప్పుకోవడంతో ఏ సినిమాపై కూడా దృష్టి పెట్టలేకపోతున్నాడనేది ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తోన్న మాట. చాలా ట్యూన్స్ మక్కీకి మక్కీ కాపీ కొట్టాడన్న పేరు వచ్చేసింది. అంతేకాదు సినిమా ఆలస్యం అవ్వడమే కాకుండా ఫైనల్ అవుట్‌పుట్‌ కూడా సరిగ్గా రావట్లేదని పెద్ద టాకే నడుస్తుంది. అందుకే తమన్‌పై మేకర్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట. ప్రస్తుతం తమన్ చేతిలో వరుసగా సినిమాలు ఉన్నాయి. ఇదే ఇప్పుడు తమన్‌ను ఇరకాటంలో పెడుతోందట. ఈ విషయంపైనే తమన్ ఇప్పుడు అన్నింటా ట్రోలింగ్‌కు గురవుతున్నాడట పాపం.

ఇప్పుడు తమన్ చేతినిండా ఉన్నవన్నీ భారీ ప్రాజెక్టులే. నిన్నటి వరకూ ఆయన బ్రో సినిమా రీ రికార్డింగ్ పనుల్లో బిజీగా ఉన్నాడు. అలాగే బోయపాటి-రామ్ కాంబోలో వస్తోన్న సినిమాకు పని చేస్తున్నాడు. అలాగే భారీ స్థాయిలో తెరకెక్కతోన్న గేమ్ చేంజర్ సినిమాకు పనిచేస్తున్నాడు. మరోవైపు త్రివిక్రమ్-మహేష్ కాంబోలో గుంటూరు కారం సినిమాకు కూడా తమనే సంగీతం అందిస్తున్నాడు. అయితే ఇక్కడే అసలు చిక్కు వచ్చింది. ఇన్ని సినిమాలకు ఒకేసారి పనిచేయాల్సి వస్తున్నందున తమన్ తీవ్ర ఒత్తిడికి గురవ్వతున్నట్లు తెలుస్తోంది. ఆ ఎఫెక్టే ఇప్పుడు తమన్ ఇస్తున్న ట్యూన్స్ మీద పడుతోందన్న బీభత్సమైన టాక్ నడుస్తోంది. దీనికి ఈ మధ్యే రిలీజైన జానవులే.. సాంగే నిదర్శనమంటున్నారు. తమన్ బాణీ నుంచి వచ్చిన ఈ పాట.. తమన్ అభిమానులకు కూడా నచ్చలేదట.

తమన్ గతంలో పని చేసిన వీరసింహారెడ్డి సినిమాకు రీరికార్డింగ్‌ను లేట్ చేయడంతో ఆ ప్రభావం మూవీ రిలీజ్‌పై పడిందన్నవాదన గట్టిగానే వినిపించింది. తాజాగా రామ్ పోతినేని-బోయపాటి కాంబోలో వస్తున్న స్కంధ మూవీ షూటింగ్ పూర్తయినా.. తమన్ ఒక పాట బ్యాలెన్స్ ఉంచేయడంతో ఆ మూవీ కూడా లేట్ అయ్యేలా ఉందని టాక్. రామ్ ప్రస్తుతం ఇస్మార్ట్ శంకర్-2 కోసం లుక్ మార్చేశాడు. మరి మళ్లీ స్కంధకు టైమ్ ఇస్తాడా లేదా అనేది చూడాలి.

మరోవైపు బ్రో మూవీ రీరికార్డింగ్ సమయంలో కూడా తమన్‌పై ఒత్తిడి బాగా పడిందనే వార్త కూడా వినిపించింది. అటు గుంటూరు కారం సినిమాకు తమన్ అందించిన మ్యూజిక్‌పై మహేష్ అసంతృప్తిగా ఉన్నాడని తెలుస్తోంది. తమన్ ప్లేస్‌లో మరో ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్లను తీసుకొచ్చి పని పూర్తి చేయాలని చూస్తున్నారట. మరోవైపు ఇప్పటికే తమన్‌ను ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పించారని టాక్ కూడా వినిపిస్తోంది. మరి ఇన్ని ఒత్తిడుల మధ్య తమన్ ఒప్పందం కుదుర్చుకున్న సినిమాలను పూర్తి చేస్తాడో లేదో చూడాలి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fourteen − 8 =