గతేడాది లాగానే ఈ ఏడాది కూడా చిన్న సినిమాలు అదే హవాను కొనసాగిస్తున్నాయి. ఏడాది ప్రారంభంలోనే రెండు చిన్న సినిమాలు ఇటు తెలుగు ఇండస్ట్రీలోనూ ,అటు తమిళ ఇండస్ట్రీలోనూ దుమ్మురేపుతున్నాయి. కొంత కాలంగా సరైన బాక్సాఫీస్ హిట్ లేక వెలవెలబోయిన తమిళనాడులోని థియేటర్స్, రీసెంట్‌గా విడుదలైన డ్రాగన్ సినిమాతో మళ్లీ ఊపిరి పోసుకుంది.బాక్స్ ఆఫీస్ వద్ద డ్రాగన్ మూవీ సుమారుగా 150 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించింది.
అలా రీసెంట్‌గా మన తెలుగులో విడుదలైన కోర్ట్ సినిమా కూడా అలాగే బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్నాయి. నేచురల్ స్టార్ నాని నిర్మాతగా వ్యవహరించిన మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వద్ద కనకవర్షాన్ని కురిపిస్తుంది. వీకెండ్‌లో కలెక్షన్స్‌నే వీక్ డేస్ లో కూడా రాబడుతూ ట్రేడ్ పండితులు కూడా షాక్ అయ్యేలా చేస్తుంది.
కాగా కోర్ట్ చిత్రానికి ఆరవ రోజు కోటి 13 లక్షల రూపాయల షేర్ వసూళ్లు తెలుగు వెర్షన్ నుంచి వచ్చాయని, ఓవరాల్ వరల్డ్ వైడ్‌గా కోటి 58 లక్షల రూపాయలు వచ్చాయని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. కేవలం బుక్ మై షో టికెట్ పోర్టల్ యాప్లో ఈ సినిమాకు దాదాపుగా 8 లక్షల టిక్కెట్లు అమ్ముడుపోయాయని అంటున్నారు. ఈ వీకెండ్‌తో 1 మిలియన్ మార్కుకి చేరుకుంటుందని అంటున్నారు.
వరల్డ్ వైడ్‌గా మొత్తం మీద 6 రోజులకు కలిపి 34 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు రాగా, షేర్ వసూళ్లు 18 కోట్ల రూపాయల వరకు వచ్చాయని అంటున్నారు. ఈ వీకెండ్‌తో ఈ మూవీ పాతిక కోట్ల రూపాయల షేర్ మార్కుని దాటేస్తుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.ఈ చిత్రంలోని హీరో, హీరోయిన్ల పేర్లు కూడా చాలామందికి తెలీవు. అయినా కూడా ఈ రేంజ్ గ్రాస్ వసూళ్లు వచ్చాయంటే మంచి సినిమాని మన తెలుగు ఆడియన్స్ ఏ రేంజ్ లో ఆదరిస్తారో అర్ధం చేసుకోవచ్చు.