పవర్‌ స్టార్‌ పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్ ‘ ఫస్ట్ లుక్ విడుదల

#PSPK26, #VakeelSaab, Latest Telugu Movies News, Pawan Kalyan New Look in Vakeel Saab, Pawan Kalyan Vakeel Saab First Look, Tollywood Movie Updates, Vakeel Saab, Vakeel Saab First Look, Vakeel Saab Movie Latest News, Vakeel Saab Movie Updates, Vakeel Saab Telugu Movie
జనసేన అధ్యక్షుడు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హిందీ, తమిళ్ భాషల్లో ఘనవిజయం సాధించిన పింక్ చిత్రం రీమేక్ తెలుగులో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని బోనీ కపూర్ కు చెందిన బే వ్యూ ప్రాజెక్ట్స్ తో కలసి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నారు. వేణు శ్రీరాం దర్శకత్వంలో ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. దాదాపు రెండు సంవత్సరాల తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను వెండితెరపై చూసేందుకు మెగాభిమానులతో పాటుగా, ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో మార్చ్ 2, సోమవారం సాయంత్రం 5 గంటలకు ఈ చిత్రం యొక్క టైటిల్ ను, ఫస్ట్ లుక్ ను అధికారికంగా విడుదల చేశారు.
ఈ చిత్రానికి ‘వకీల్ సాబ్ ‘ అనే టైటిల్ ను ఖరారు చేశారు. అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫస్ట్ లుక్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటుంది. చేతిలో పుస్తకం, కళ్ళజోడు పెట్టుకుని పడుకొని ఉన్న పవన్ కళ్యాణ్ కొత్త లుక్ సోషల్ మీడియాలో ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అవుతుంది. #PSPK26FirstLookFestival, #VakeelSaab, #pspk26movie హ్యాష్ టాగ్స్ సోషల్ మీడియాలో టాప్ ప్లేస్ లో ట్రెండ్ అవుతున్నాయి. త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అజ్ఞాతవాసి చిత్రం తర్వాత రాజకీయాల్లో బిజీగా ఉండడంతో సినిమాలు చేసేందుకు పవన్ కళ్యాణ్ ఆసక్తి చూపలేదు. గత కొన్ని రోజులుగా పవన్ మళ్ళీ సినిమాలు చేయాలనీ అభిమానులు, పలువురు సినీ ప్రముఖులు కోరుకుంటున్నారు.
ఈ నేపథ్యంలో వకీల్ సాబ్ వంటి సందేశాత్మక చిత్రంతో ఆయన ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. నిర్మాణం జరుపుకుంటున్న ఈ సినిమా మే నెలలో విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ చిత్రంలో నివేదా థామస్‌, అంజలి, అనన్య ముఖ్యపాత్రల్లో నటిస్తుండగా, ఎస్.ఎస్ థమన్‌ సంగీతం అందిస్తున్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా మార్చ్ 8వ తేదీన వకీల్ సాబ్ మూవీ ఫస్ట్ సాంగ్ విడుదల చేసేందుకు చిత్రబృందం సిద్దమవుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here