జూనియర్ ఎన్టీఆర్ దేవర చిత్రం కోసం ప్రేక్షకులంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇటీవలే మేకర్స్ ట్రైలర్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. విడుదలైన కొన్ని నిమిషాల్లోనే దేవర ట్రైలర్ భారీ వ్యూస్ సొంతం చేసుకుంది. ఈ క్రమంలో తాజాగా దేవరపై మరో అప్డేట్ వచ్చింది. లిరిసిస్ట్ రామజోగయ్య శాస్త్రి ఎక్స్ వేదికన ఓ పోస్ట్ పెట్టి.. ఈ చిత్రంపై అభిమానుల్లో మరింత జోష్ నింపారు. దేవర నాలుగో సాంగ్ పై అప్డేట్ ఇచ్చారు. వచ్చే వీక్ పాన్ ఇండియా లెవల్లో పెద్ద బాంబ్ బ్లాస్ట్ కానుంది… ఆయుధ పూజ ట్రాక్ రాబోతుంది అని రాసుకొచ్చారు.
గతంలో దేవర యూనిట్, కెమెరామెన్ రత్నవేలు దేవర సినిమాలోని ఆయుధ పూజ సాంగ్ గురించి గొప్పగా చెప్తూ ట్వీట్స్ వేశారు. ఇప్పుడు పాట రాసిన రామజోగయ్య శాస్త్రి కూడా వచ్చే వారమే ఆ పాట రిలీజ్ కాబోతుంది అంటూ చెప్పడంతో సినిమాపై, ముఖ్యంగా ఆయుధ పూజ సాంగ్ పై మరింత హైప్ నెలకొంది. మరి ఆయుధ పూజ సాంగ్ ఫ్యాన్స్ ని ఏ రేంజ్ లో మెప్పిస్తుందో చూడాలి.
దేవర సినిమాకు బిజినెస్ కూడా భారీగా జరుగుతుంది అని తెలుస్తుంది. ఇప్పటికే అన్ని చోట్ల థియేట్రికల్ సేల్ జరిగిపోయిందని, ఓటీటీ రైట్స్ కూడా భారీ ధరకు అమ్ముడు పోయాయని తెలుస్తోంది. తాజాగా సమాచారం ప్రకారం తెలుగులో దేవర సినిమాకు భారీ బిజినెస్ జరిగిందట. నైజాంలో 42 కోట్లకు, ఆంధ్రలో 55 కోట్లకు, సీడెడ్ లో 20 కోట్లకు దేవర థియేట్రికల్ రైట్స్ అమ్ముడు పోయాయని సమాచారం.
ఈ లెక్కన తెలుగులో దేవర బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే కనీసం 120 కోట్లు షేర్ కలెక్ట్ చేయాలి. అంటే ఆల్మోస్ట్ 240 కోట్ల వరకు గ్రాస్ వసూలు చేస్తే కానీ దేవర తెలుగు రాష్ట్రాల్లో సేఫ్ అవుతుంది. ఇక హిట్ అవ్వాలంటే కనీసం 300 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ తెలుగు రాష్ట్రాల నుంచే రావాలి. మరి దేవర ఈ రేంజ్ లో తెలుగులో కలెక్షన్స్ రాబడుతుందా చూడాలంటే రిలీజ్ వరకు వేచి చూడాల్సిందే.