దర్శకుడు హరీష్ శంకర్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

Power Star Pawan Kalyan Extends Birthday Wishes to Director Harish Shankar,Power Star Pawan Kalyan Extends Birthday Wishes,Pawan Kalyan Wishes to Director Harish Shankar,Pawan Kalyan Extends Birthday Wishes,Mango News,Mango News Telugu,Latest News on Harish Shankar Directorial,Director Harish Shankar Latest News,Director Harish Shankar Latest Updates,Power Star Pawan Kalyan Latest Updates,Power Star Pawan Kalyan Live News,Director Harish Shankar Live News

ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ పుట్టినరోజు నేడు (మార్చి 31). పుట్టినరోజు సందర్భంగా హరీష్ శంకర్ కు పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు.

“ప్రేక్షకుల నాడీ..నవతరం అభిరుచులు తెలిసిన దర్శకుడు హరీష్ శంకర్. ఆయనకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. తెలుగు భాష, రచనలపైనా, కళల గురించి చక్కటి అవగాహన ఉన్న దర్శకుడు హరీష్ శంకర్. భవిష్యత్తులో మరిన్ని విజయాలు అందుకోవాలని ఆకాంక్షిస్తున్నాను” అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. దర్శకుడు హరీష్ శంక‌ర్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో త్వరలో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ అనే సినిమా షూటింగ్ ప్రారంభించుకోనున్న విషయం తెలిసిందే. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన గబ్బర్ సింగ్ సినిమా బాక్సాఫీసు వద్ద సంచనాలు నమోదు చేయడంతో, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాపై కూడా అభిమానుల్లో భారీ అంచనాలు నెలకున్నాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two + 15 =