డ్యాన్స్ అంటే చిరంజీవి.. చిరంజీవి అంటే డ్యాన్స్.. ఈ మాట ఓ సినీ అభిమనాని అడిగిన చెబుతారు. అందుకే వరల్డ్ ఫేమస్ గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ అవార్డు మెగాస్టార్ ని వరించింది. మెగాస్టార్ చిరంజీవి 46 సంవత్సరాల కాలంలో 156 సినిమాల్లో 537 పాటల్లో 24000 డ్యాన్స్ చేసినందుకు గాను వరల్డ్ ఫేమస్ గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ అవార్డు దక్కింది. ఆదివారం హైదరాబాద్ లో బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ చేతుల మీదుగా ఈ అవార్డు అందుకున్నారు. ఈ అవార్డు దక్కడంతో మెగా అభిమానులు, సినీ ప్రముఖులే కాదు రాజకీయ నేతలు సైతం అభినందనలు తెలియజేస్తూ తమ సంతోషాన్ని పంచుకుంటూ చిరంజీవి కి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
చిరంజీవి పేరు చేరడంపై జనసేన అధినేత ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. అన్నయ్య పేరు గిన్నీస్ బుక్ లో ఎక్కడంపై తన సంతోషాన్ని వ్యక్తం చేసారు. ‘ద మోస్ట్ ప్రొలిఫిక్ ఫిల్మ్ స్టార్ ఇన్ ఇండియన్ సినిమా’ అని గౌరవించడం తనతో పాటు అభిమామానులైన ప్రతి ఒక్కరికీ ఆనందాన్నిస్తుందన్నారు. ఈ సందర్బంగా అన్నయ్య చిరంజీవి గారికి హృదయపూర్వక అభినందనలు తెలియచేస్తున్నట్టు ఓ లేఖ విడుదల చేశారు.
చిరంజీవి గత కొన్నేళ్లుగా పలు అవార్డులు వరిస్తూనే ఉన్నాయి. చిరంజీవిని 2006లో అప్పటి భారత ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డుతో సత్కరించింది. అదే ఏడాది ఆంధ్రా విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్‌ని కూడా అందుకున్నారు. 2016లో ప్రతిష్ఠాత్మక రఘుపతి వెంకయ్య పురస్కారాన్ని అందుకున్నారు. ఇక 2022లో భారత ప్రభుత్వం నుంచి ఇండియన్ ఫిలిం పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ పురస్కారం కూడా దక్కింది. 2024 జనవరిలో కేంద్ర ప్రభుత్వం ఆయనను పద్మ విభుషణ్ అవార్డుతో సత్కరించింది. ఇక ఇప్పుడు మరో అంతర్జాతీయ గుర్తింపు లభించింది.
ఇక అటు తమ్ముడ్ని చూస్తే..సినిమాల్లోనే కాదు పాలనా లో కూడా తన మార్క్ చూపిస్తున్నారు జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. తాజాగా తాను తీసుకున్న పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రపంచ రికార్డు సృష్టించింది. ఆగస్టు 23న రాష్ట్ర వ్యాప్తంగా ఒకేరోజు 13,326 పంచాయతీల్లో గ్రామ సభల నిర్వహణను వరల్డ్ రికార్డ్స్ యూనియన్ గుర్తించింది. ఈ రికార్డుకు సంబంధించిన పత్రాన్ని, మెడల్ ను ఆయనకు ప్రతినిధులు అందించారు.
ఇక పంచాయతీరాజ్ మంత్రిగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు చేపట్టిన 100 రోజుల్లోనే ఆ శాఖకు అరుదైన గౌరవం దక్కింది. ఇలా మెగా బ్రదర్స్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ వేర్వేరు విభాగాల్లో ప్రపంచ రికార్డులు అందుకోవడం విశేషం. అక్కడ తమ్ముడు ప్రపంచ రికార్డు నెలకొల్పితే..ఇక్కడ అన్నయ్య గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ నెలకొల్పడని అభిమానులు మాట్లాడుకుంటున్నారు.
చిరంజీవి విషయానికొస్తే.. గతేడాది ‘భోళా శంకర్’ మూవీతో పలకరించిన అన్నయ్య.. త్వరలో ‘విశ్వంభర’ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమాను ‘బింబిసార’ ఫేమ్ వశష్ఠ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమా వచ్చే సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.