ప్రధానితో మీటింగ్‌పై మెగాస్టార్ ట్వీట్

Megastar Tweets On Meeting With Prime Minister, Meeting With Prime Minister, Megastar Meeting With Prime Minister, Chiranjeevi, Megastar Tweets On Meeting With Prime Minister, Waves, World Audio Visual And Entertainment Summit, Megastar, Tollywood, Tollywood News, Tollywood Latest News, Tollywood Updates, Live Updates, Breaking News, Headlines, Live News, Mango News, Mango News Telugu

భారత్‌ను గ్లోబల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ హబ్‌గా తీర్చిదిద్దేక్రమంలో మోదీ ప్రభుత్వం త్వరలోనే పలు కీలక నిర్ణయాలను తీసుకోనుంది. దీనిలో భాగంగానే ఈ ఏడాది చివరిలో WAVES సమ్మిట్.. అంటే వరల్డ్‌ ఆడియో విజువల్‌ అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సమ్మిట్‌ను కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించబోతోంది. ఈ కీలక సమ్మిట్ కు సంబంధించిన ప్రధాని మోదీ సినీ పరిశ్రమకు సంబంధించిన ప్రముఖ నటీనటులు, వ్యాపార వేత్తలతో ఫిబ్రవరి 7న సమావేశమయ్యారు.

దీనికోసం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ప్రధాని మోదీ.. వేవ్స్ సమ్మిట్ కోసం ప్రముఖుల సలహాలు, సూచనలు తీసుకున్నారు. ఈ సమావేశానికి టాలీవుడ్ నుంచి మెగాస్టార్ చిరంజీవితో పాటు బాలీవుడ్‌ స్టార్స్‌ అమితాబ్‌ బచ్చన్‌,షారుఖ్‌ఖాన్‌,ఆమిర్‌ఖాన్‌, అనిల్‌ కపూర్‌, మిథున్‌ చక్రవర్తి, అక్షయ్‌కుమార్‌, హేమమాలినీతో పాటు దీపికా పదుకొణె హాజరయ్యారు. అలాగే దక్షిణాది నుంచి సూపర్ స్టార్ రజనీకాంత్‌, నాగార్జున,ఎ.ఆర్.రెహమాన్‌తో కూడా మోదీ మాట్లాడారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్ పూర్తి అయిన తర్వాత మోదీ తన సోషల్ మీడియా ఖాతాలో ఈ సమావేశం గురించి మరోసారి ప్రస్తావించారు. తాజాగా దీనిపై మెగాస్టార్ చిరంజీవి కూడా ఎక్స్ వేదికగా స్పందించారు. ప్రధాని మోదీతో తాను మాట్లాడుతోన్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసిన చిరు..వరల్డ్‌ ఆడియో విజువల్‌ అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సమ్మిట్‌ అడ్వైజరీ బోర్డ్ లో భాగం కావడం ఆనందంగా ఉందని చెప్పారు.

ఇతర గౌరవనీయ సభ్యులతో కలిసి ఈ సమావేశంలో పాలు పంచుకోవడం నిజంగా ఒక విశేషమని చిరంజీవి అన్నారు. మోదీ జీ #WAVES భారతదేశాన్ని ముందుకు నడిపిస్తాయనడంలో ఎటువంటి సందేహం లేదని.. సాఫ్ట్ పవర్’ ప్రపంచంలో అతి త్వరలో కొత్త పుంతలు తొక్కుతుందని అన్నారు. దీనిలో తనకు అవకాశం కల్పించిన గౌరవనీయులైన ప్రధాన మంత్రి నరేంద్రమోదీజీ గారికి ధన్యవాదాలని మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు.