రాబోయే 40 రోజుల్లో,12 తెలుగు సినిమాల విడుదల

July and August 2019 Telugu Movies Release Dates, Latest Telugu Upcoming Movie Releases in July and August 2019, List of Telugu Movies Released in 2019 July and August, List Of Telugu Movies Releasing in Next 40 Days, Mango News, Tollywood Upcoming Movies Releasing in July and August 2019, Upcoming Telugu movies In July and August

తెలుగు సినిమా పరిశ్రమలో జూలై 18 మొదలుకొని, ఆగస్ట్ 30 వరకు 12 సినిమాలు విడుదలయ్యే అవకాశం ఉంది, రాబోయే 40 రోజుల్లో ఈ చిత్రాలు ప్రేక్షకులను కనువిందు చేయనున్నాయి. డిఫరెంట్ జోనర్స్ తో నిర్మించబడ్డ ఈ చిత్రాలు వరుసగా విడుదలై సందడి చేయబోతున్నాయి. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా రూపొందిన ‘ ఇస్మార్ట్ శంకర్ ‘ చిత్రం జూలై 18 న విడుదలవుతుంది, అదే విధంగా భరత్ కమ్మ దర్శకత్వంలో యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన నటించిన ‘ డియర్ కామ్రేడ్ ‘ చిత్రం జూలై 26 న ప్రేక్షకులముందుకు రాబోతుంది. హీరో కార్తికేయ కొత్త చిత్రం ‘ గుణ 369 ‘ ఆగస్ట్ 2 న రిలీజ్ కానుంది.

ఇక అక్కినేని నాగార్జున,రకుల్ ప్రీత్ జంటగా నటించగా, రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రూపొందిన ‘ మన్మథుడు 2 ‘ చిత్రం ఆగస్ట్ 9 న విడుదల కానుంది. శర్వానంద్, సుధీర్ వర్మ కాంబినేషన్లో వస్తున్న ‘ రణరంగం ‘, అడవి శేష్ ‘ఎవరు’ చిత్రాలు ఆగస్టు 15 న విడుదల చేస్తునట్టు ప్రకటించారు. ఐశ్వర్య రాజేష్, రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలో నటించగా, భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో రూపొందిన ‘ కౌసల్య కృష్ణమూర్తి ‘ ఆగస్ట్ 23 న రిలీజ్ కానుంది మరియు నేచురల్ స్టార్ నాని ‘ గ్యాంగ్ లీడర్ ‘ సినిమా ఆగష్టు 30 న ప్రపంచవ్యాప్తంగా విడుదలకి సిద్ధమవుతోంది. ఇవిగాక ప్రభాస్ నటించిన భారీ బడ్జెట్ చిత్రం ‘ సాహో ‘, బెల్లంకొండ శ్రీనివాస్ ‘ రాక్షసుడు ‘ చిత్రాలు కూడ ఆగస్ట్ నెలలోనే విడుదల కానున్నాయి.

అంతే కాకుండా స్టార్ హీరో అజిత్ నటించిన ‘నేర్‌కొండ పార్‌వై ‘, చియాన్ విక్రమ్ నటించిన ‘ మిస్టర్ కే కే ‘ డబ్బింగ్ వెర్షన్స్ కూడ ఆగస్ట్ నెలలోనే విడుదల అవుతున్నాయి. వరుస సినిమాల నేపథ్యంలో బాక్సాఫీస్ వద్ద సందడి నెలకొననుంది, కొన్ని చిత్రాలపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 + six =