అల్లు అర్జున్ నటించిన పుష్ప ది రూల్ కోసం అభిమానులు ఎంతో ఆశక్తిగా ఎదురుచూస్తున్నారు. డిసెంబర్ 5న ఈ సినిమా విడుదల కానుంది. పుష్ప: ది రైజ్ విజయవంతమైన తర్వాత , పుష్ప 2 పై అంచనాలు భారీగా ఉన్నాయి. చిత్ర యూనిట్ కూడా ప్రమోషన్లు భారీగా చేసి ఎలాగైనా భారీ వసూళ్లను సొంత చేసుకోవాలనే లక్ష్యంతో ఉన్నారు. అయితే, అక్టోబర్ 28 నుండి నవంబర్ 28 వరకు హైదరాబాద్‌లో విధించిన కర్ఫ్యూ ఈ సినిమా ప్రమోషన్ కార్యకలాపాలకు అంతరాయం కలిగించవచ్చనే విషయం అల్లు అర్జున్ ఫ్యాన్స్ తో పాటు నిర్మాతలను కలవరపెడుతోంది.
హైదరాబాద్‌లో పుష్ప 2 ఈవెంట్స్..
అక్టోబర్ 28 నుండి నవంబర్ 28 వరకు హైదరాబాద్లో ఒక నెల పాటు కర్ఫ్యూ విధించబడింది. నిరసనలతో నగరంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకు కొన్ని గ్రూపులు ప్రయత్నిస్తున్నందున పోలీసులు కర్ఫ్యూ విధించారు. అయితే ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద మాత్రమే శాంతియుత నిరసనలకు అనుమతి ఉందని ప్రకటించారు పోలీసులు. కర్ఫ్యూలో భాగంగా బహిరంగ సభలు మరియు ఈవెంట్‌లు నిషేధం, దీంతో ఇది సినిమా ప్రచార కార్యక్రమాలకు ఆటంకం కలిగిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
హైదరాబాద్ లో కర్ఫ్యూ ఉండటంతో పుష్ప 2 టీమ్ తమ మార్కెటింగ్ వ్యూహాన్ని మర్చే పునరాలోచనలో పడే అవకాశముంది. ముఖ్యంగా హైదరాబాద్‌లో జరిగే ప్రీ-రిలీజ్ ఈవెంట్ సినిమా పై హైప్ క్రియోట్ చేయడంలో చాలా కీలకం. దీంతో చిత్రనిర్మాతలు ఇప్పటికే ప్రచార కార్యక్రమాలను ఆంధ్రప్రదేశ్‌కి మార్చాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. అంతే కాదు అభిమానులను ఎలా ఆకట్టుకోవాలనే దానిపై కూడా ఆలోచన చేస్తున్నారట.
ఇక పుష్ప 2 విషయానికి వస్తే , ఈ చిత్రంలో రష్మిక మందన్న , ఫహద్ ఫాసిల్, సునీల్, అనసూయ భరద్వాజ్ మరియు బ్రహ్మాజీ వంటి తారాగణం ఉంది . మైత్రీ మూవీ మేకర్స్ భారీ ఎత్తున ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది, దీనికి తోడు ప్రముఖ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించడంతో సినిమాపై మరింత హైప్ క్రియోట్ అయింది. కాగా పుష్ప2 రికార్డు స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా 11,500 స్క్రీన్లలో విడుదల కానుంది.