శోభిత కాదు..ఇకపై లక్ష్మీ శోభిత నాగ చైతన్య నిర్ణయానికి కాబోయే భార్య సై

Not Shobhita Now Lakshmi Shobhita, Shobhita Name Change After Marriage, Shobhita Name Change, Amala, Daggubati Lakshmi, Lakshmi Shobhita, Shobhita, Naga Chaitanya And Akhil To Get Married, Naga Chaitanya And Akhil Marriage, Same Day Naga Chaitanya And Akhil Wedding, Naga Chaitanya And Akhil Wedding, Akhil, Akkineni Family, Akkineni Family Wedding, Naga Chaitanya, Nagarjuna, Wedding, Tollywood, Tollywood News, Tollywood Latest News, Tollywood Updates,Mango News, Mango News Telugu

నాగ చైతన్య,శోభిత ధూళిపాళ్ల వివాహానికి సమయం దగ్గర పడుతుండటంతో.. ఏర్పాట్లు ఘనంగా మొదలయ్యాయి. అయితే శోభితతో రెండేళ్ల నుంచి ప్రేమలో ఉంటూ..ఇప్పుడు వివాహం చేసుకుంటున్న నాగ చైతన్య ఆమెకు రెండు కండీషన్స్ పెట్టాడన్న వార్త వైరల్ అవుతుంది.

అక్కినేని వారసుడు.. హీరో నాగ చైతన్య రెండో వివాహం డిసెంబర్ 2న జరగనుందనే విషయం తెలిసిందే. హీరోయిన్ సమంతతో ప్రేమ వివాహం చేసుకున్న చైతూ.. 2021లో విడాకులు ఇచ్చారు. తర్వాత మరో హీరోయిన్ శోభితతో ప్రేమలో పడి.. రెండేళ్లకు పైగా డేటింగ్ చేస్తున్న ఈ జంట పెళ్ళి బంధంతో ఒక్కటి కాబోతున్నారు.

ఆగస్టు 8న హైదరాబాద్ లోని నాగార్జున ఇంట్లో నాగ చైతన్య,శోభితల నిశ్చితార్థ వేడుక సింపుల్‌గా జరిగింది. కుటుంబ సభ్యులు మాత్రమే పాల్గొన్న ఈ వేడుక గురించి.. మంచి ముహూర్తం కోల్పోకూడదనే హడావుడిగా ఎంగేజ్మెంట్ జరిపామని నాగ్ వివరణ ఇచ్చారు.

డిసెంబర్ 4న జరగనున్న చైతూ, శోభిత పెళ్లి కోసం తయారుచేసిన పెళ్లి కార్డ్ ఇప్పుడు వైరల్ అవుతుంది. శుభలేఖలో నాగార్జున, అమల పేర్లు.. అలాగే చైతన్య తల్లి లక్ష్మి, స్టెప్ ఫాదర్ విజయ్ రాఘవన్ పేర్లు కూడా యాడ్ అయి ఉండటం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. అంతేకాదు అక్కినేని నాగేశ్వరరావు, దగ్గుబాటి రామానాయుడు దంపతుల పేర్లు కూడా ఈ కార్డులో పొందుపరిచారు.

ఇదిలా ఉండగా తమ పెళ్లికి ముందే నాగ చైతన్య ,శోభిత కలిసి కొన్ని నిర్ణయాలు తీసుకున్నారట. నాగ చైతన్య మదర్ లక్ష్మి కోరికతో.. శోభిత పేరు పెళ్లి తర్వాత లక్ష్మి శోభితగా మారనుందట. తన పేరుకు ముందు నాగ చైతన్య తల్లి పేరును జోడించడానికి శోభిత సంతోషంగా ఒప్పుకుందట.

అలాగే పెళ్లిలో హెవీ మేకప్ ఉండకూడదని..సాంప్రదాయ చీరకట్టు, నార్మల్ మేకప్ తో సహజంగా కనిపించాలని చైతూ తల్లి లక్ష్మి చెప్పగా..దానికి కూడా శోభిత అంగీకరించారని ఓ న్యూస్ వైరల్ అవుతుంది. కాగా లక్ష్మిని వివాహం చేసుకున్న నాగార్జున విడాకులు ఇచ్చారు. తర్వాత హీరోయిన్ అమలను ప్రేమ వివాహం చేసుకున్నారు.మరోవైపు దగ్గుబాటి లక్ష్మి చెన్నైకి చెందిన వ్యాపారవేత్త అయిన విజయ్ రాఘవన్ ని రెండో పెళ్లి చేసుకుంది.