ఓజీ రిలీజ్ డేట్ వచ్చేసింది.. పవన్ కోసం రంగంలోకి దిగిన స్టార్ హీరో

OG Release Date Has Arrived, OG Release Date Fixed, OG Release Date Out, OG Release Date Announced, OG, OG Release Date, Pawan, Pawan Kalyan, Simbu, OG Release Date Update, Tollywood, Tollywood News, Tollywood Latest News, Tollywood Updates, Live Updates, Breaking News, Headlines, Live News, Mango News, Mango News Telugu

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సినిమా ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ ఓజీ మూవీ గురించి క్రేజీ అప్ డేట్ బయటకు వచ్చింది. ముంబై బ్యాక్ డ్రాప్‌లో గ్యాంగ్ స్టర్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ మూవీని .. యంగ్ డైరెక్టర్ సుజీత్ హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే రిలీజయిన హంగ్రీ చీతా గ్లింప్స్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించగా ఒక డై హార్డ్ ఫ్యాన్‌ పవన్‌ను డైరెక్ట్ చేస్తే ఎలా ఉంటుందో.. ఓజీతో సుజీత్ చూపించబోతున్నాడంటూ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు .

ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకోగా పవన్ ఒక్కసారి డేట్స్ ఇస్తే చాలు.. షూటింగ్ మొత్తం పూర్తవుతుందని మేకర్స్ ధీమాగా ఉన్నారు. పవన్ కూడా మిగతా సినిమాల కంటే ముందుగా ఓజీ సినిమాను కంప్లీట్ చేయడానికి రెడీ అవుతున్నారు. ఇలాంటి సమయంలోనే ఓజి మూవీ గురించి ఒక ఆసక్తికరమైన న్యూస్ వెలుగులోకి వచ్చింది.

ఈ మూవీలో ఒక పాట కోసం తమిళ స్టార్ శింబును మేకర్స్ సంప్రదించగా..శింబు వెంటనే ఓజీలో పవన్ కళ్యాణ్ కోసం ఒక పాట పాడటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇటు నిజానికి.. ఈ సెప్టెంబర్ 27నే ఓజీ మూవీ థియేటర్లోకి రావాల్సి ఉంది. కానీ పవన్ రాజకీయాలలో బిజీ అవ్వడంతో.. ఓజీని వాయిదా వేయాల్సి వచ్చింది. ఓజీ ప్లేస్‌లో ఇప్పుడు ఎన్టీఆర్ దేవర రిలీజ్ అవుతోంది.

పవన్ కళ్యాణ్ ఓజీ మూవీ రిలీజ్ వచ్చే ఏడాదిలో ఉంటుందని అంతా ఫిక్స్ అయ్యారు. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం.. 2025 సమ్మర్ కానుకగా మార్చ్ 27న ఓజీ రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నట్టు సినిమా యూనిట్ నుంచే ఓ టాక్ వినిపిస్తోంది. లాంగ్ వీకెండ్ కలిసొచ్చేలా మార్చి 27 డేట్‌ను మేకర్స్ లాక్ చేసినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఓజీ రిలీజ్ డేట్ తెలిసినందుకు సంతోషపడాలో.. ఓజీ రాక కోసం మరో 7 నెలలు వెయిట్ చేయాల్సిందేనా తెలియడం లేదంటూ పవన్ ఫ్యాన్స్ అంటున్నారు.