టాలీవుడ్లో కొన్నాళ్ల నుంచి రీరిలీజ్ ట్రెండ్ ఓ రేంజ్‌లో జరుగుతుంది. డైరెక్ట్ రిలీజ్ సినిమాల కంటే ఎక్కువగా రీరిలీజ్ సినిమాలు కలెక్షన్స్ రాబడుతున్నాయన్నా అది అతిశయోక్తి కాదు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా హరీశ్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం గబ్బర్ సింగ్’. 2012లో విడుదలైన గబ్బర్ సింగ్ మూవీ పవన్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచి కలెక్షన్ల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ మూవీని మరోసారి పవన్ పుట్టినరోజు సందర్భంగా మూవీ మేకర్స్ సెప్టెంబర్ 2న ‘గబ్బర్ సింగ్’ రీ-రిలీజ్ చేశారు .
కాగా ఇటీవల మహేశ్ బాబు పుట్టిన రోజు సందర్భంగా మురారి చిత్రాన్ని, మెగాస్టార్ బర్త్ డే కానుకగా ఇంద్ర సినిమాను రీరిలీజ్ చేయగా అవి రికార్డులు క్రియేట్ చేసాయి. ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎం హోదాలో, మొదటి సారి ఎమ్మెల్యేగా గెలవడంతో సెప్టెంబర్ 2 పవన్ బర్త్ డే సందర్బంగా.. పవర్ స్టార్ ఫ్యాన్స్ గబ్బర్ సింగ్ రీరిలీజ్ ను భారీ స్థాయిలో ప్లాన్ చేశారు.
అయితే ఈ మూవీతో కేవలం అడ్వాన్సు బుకింగ్స్ కలెక్షన్స్ 4 కోట్ల రూపాయల కొల్లగొట్టిన గబ్బర్ సింగ్ ప్రీమియర్స్ ఫస్ట్ డే కలెక్షన్స్ కలిపి మొత్తం రూ. 8.02 కోట్లు రాబట్టారు పవర్ స్టార్. సూపర్ స్టార్ మహేష్ బాబు మురారి రీరిలీజ్ డే – 1 రూ .5.41 కోట్లను బద్దలు కొట్టి ఆల్ టైమ్ రికార్డు క్రియేట్ చేసింది. గబ్బర్ సింగ్ రిలిజ్ అయి దాదాపు 12 సంవత్సరాలు అయినా కూడా ఇప్పటికీ పవర్ స్టార్ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదని రీరిలీజ్ లో సాధించిన కలెక్షన్స్ చుస్తే అర్ధమవుతోందని పవన్ అభిమానులు చెబుతున్నారు.