బిగ్ బాస్ హౌస్‌లోకి రీఎంట్రీ ఇచ్చిన అలీరేజా

Ali Reza Re entry Into Bigg Boss House, Ali Reza Re-enters as a wild card Into Bigg Boss House, Bigg Boss 3 Telugu Contestants Latest News, Bigg Boss Telugu 3, Bigg Boss Telugu 3 Ali Reza Re-enters as a wild card Into Bigg Boss House, Bigg Boss Telugu 3 Latest Updates, Bigg Boss Telugu 3 Updates, Bigg Boss Telugu 3 Weekend Episode, Bigg Boss Telugu 3 Weekend Episode Highlights, Bigg Boss Telugu 3 Weekend Episode Updates, Bigg Boss Telugu Season 3, Mango News Telugu

జూలై 21 నాడు ప్రారంభమైన బిగ్ బాస్ తెలుగు 3వ సీజన్ బుల్లితెరపై తెలుగు ప్రేక్షకులను ప్రతిరోజూ సరికొత్త మలుపులతో అలరిస్తుంది. షో ప్రారంభమైనపుడు 15 మంది సభ్యులు ఇంటిలోకి ప్రవేశించారు. ఆ తరువాత తమన్నా సింహాద్రి, శిల్ఫా చక్రవర్తి వైల్డ్ కార్డు ఎంట్రీగా బిగ్ బాస్ హౌస్‌లోకి ప్రవేశించారు. వారు ఊహించిన స్థాయిలో ఆకట్టుకుకోకపోవడంతో హౌస్ లో కేవలం రెండు వారాలు మాత్రమే ఉండి ఎలిమినేట్ అయ్యారు. ఈ నేపథ్యంలో నిర్వాహకులు మరో కొత్త వైల్డ్ కార్డు ఎంట్రీ గురించి ఆలోచించకుండా ఇప్పటికే ఎలిమినేట్ అయ్యి బయటకు వెళ్లిన అలీరేజాకు రీఎంట్రీ ఇచ్చే అవకాశం ఇచ్చారు. సెప్టెంబర్ 26, గురువారం నాడు జరిగిన 68వ ఎపిసోడ్ లో నటుడు అలీరేజా మరోసారి ఇంటిలోకి అడుగుపెట్టి ఇటు ప్రేక్షకులను, అటు ఇంటి సభ్యులను ఆశ్చర్యపరిచారు.

బిగ్ బాస్ ప్రారంభం నుంచి ఆకట్టుకున్న పోటీదారుల్లో ఒకరిగా అలీరేజా నిలిచారు. హౌస్ లో జరిగే టాస్కుల్లో మిగిలిన ఇంటి సభ్యులకు గట్టి పోటీ ఇస్తూ బుల్లితెర ప్రేక్షకుల్లో మంచి పేరు సంపాదించుకున్నాడు. కాకుంటే ఇతర సభ్యుల పట్ల కొంచెం దూకుడుగా వ్యవహరించడం, కొన్ని సార్లు పరిధి ధాటి ప్రవర్తించడంతో అనూహ్యంగా షో నుంచి ఎలిమినేట్ అయ్యారు. ఈ నేపథ్యంలో షో నుంచి బయటకు వెళ్ళాక కూడ మరోసారి అతనికి అవకాశం ఇవ్వాలని ప్రేక్షకులు కోరుకోవడంతో, నిర్వాహకులు సైతం పరిగణించి బిగ్ బాస్ హౌస్ లోకి తిరిగి వెళ్లేందుకు అలీరేజాకు మరో అవకాశం ఇచ్చారు. అలీరేజా ఎంట్రీతో ఇంటి సభ్యుల ఆనందం వ్యక్తం చేసారు. మరి ముఖ్యంగా శ్రీముఖి, శివజ్యోతి తమ సంతోషాన్ని అలీరేజాతో పంచుకున్నారు. గట్టి పోటీదారుడైన అలీరేజా ఎంట్రీతో బిగ్ బాస్ ఆట ఇకపై మరింత రంజుగా మారనుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nine + 20 =